పవన్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ షురూ, డీటేల్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ షూటింగ్ ఎట్టకేలకు హైరాబాద్ లో మొదలైంది. ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రానికి నిర్మాత.
ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగు స్పెయిన్లో ప్లాన్ చేసారు. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.
ఈ చిత్రానికి సరదా', 'హరే రామ హరే కృష్ణ' టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికారికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం.
చిత్రం షూటింగ్ కోసంరామోజీ ఫిల్మ్ సిటీలో ఓప్రత్యేకమైన సెట్ ని వేసారు. ఈ సెట్ లో ఓ పాటను తీయనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ని ఈ సెట్ లో ప్రారంభిస్తారు. ఇప్పటికి దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం అదరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసాడని, పవన్ చాలా ఉత్సాహంగా ఈ షూటింగ్ పాల్గొనటానకి రెడీ అవుతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











