బడి పిల్లలతో పవన్-త్రివిక్రమ్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ మధ్య ప్రొఫెనల్ అటాచ్‌మెంటే కాకుండా వ్యక్తి గతంగా కూడా మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. అసలు ఇండస్ట్రీలో ఎవ్వరితోనూ కలవడానికి పెద్దగా ఇష్ట పడని పవర్ స్టార్ త్రివిక్రమ్, మరికొంత మంది సన్నిహితులతోనే మాత్రమే టచ్‌లో ఉంటారు.

ఓక్రిడ్జ్ స్కూల్‌లో పవన్-త్రివిక్రమ్

పవర్ స్టార్ ఇంత క్లోజ్ గా త్రివిక్రమ్ తో తప్ప మరెవరితోనూ ఉండరేమో..!

సింపుల్ లుక్ లో పవన్ కళ్యాణ్

పిల్లలను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న పవన్
తాజాగా ఈ ఇద్దరు స్టార్స్ హైదరాబాద్ ఓక్రిడ్జ్ స్కూల్‌ను సందర్శించారు. ఈ స్కూలుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే... పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఫౌండర్స్ డే సందర్భంగా ఇద్దరూ ఈ స్కూల్ ను సందర్శించారు. అయితే వీళ్లు ఈ స్కూలుకు వచ్చింది తమ సినిమాకు లొకేషన్ పాయింటప్ కోసమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ కాంబినేసన్లో 'సరదా'(తాత్కాలిక) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











