»   » ఆ ప్లాపు సినిమా ఎఫెక్ట్ పవన్-త్రివిక్రమ్ మూవీపై...

ఆ ప్లాపు సినిమా ఎఫెక్ట్ పవన్-త్రివిక్రమ్ మూవీపై...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే తెలుగులో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందటే బాలీవుడ్లోనూ మంచి డిమాండే ఉండేది 'సర్దార్ గబ్బర్ సింగ్' ముందు వరకు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

'సర్దార్ గబ్బర్ సింగ్' ప్లాప్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీపై బాగా పడింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడక పోవడమే ఇందుకు నిదర్శనం.

Pawan-Trivikram's film fetching only 11 Cr

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాకు హిందీ డబ్బింగ్ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇలా అన్నీ కలిపి కేవలం రూ. 11 కోట్లుకు మించి ఎక్కువ ఆఫర్ రావడం లేదట.

పవన్ కళ్యాణ్ గత చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ హిందీ హిందీ రైట్స్, శాటిలైట్, ఆడియో రైట్స్ అన్ని కలిపి రూ. 20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే దీని వల్ల భారీ నష్టాలు రావడంతో..... ప్రస్తుతం అందులో సగానికంటే ఎక్కువగా పెట్టడానికి ముందుకు రావడం లేదు.

English summary
While Sardaar Gabbar Singh's Hindi rights - theatrical, satellite and audio - had been sold over 20 Crore to Eros International, the Hindi rights of Pawan-Trivikram's film fetching 11 Cr come as a surprise for the Telugu trade.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu