»   » పవన్ వార్నింగ్ ఇచ్చినా... వర్మ ఎలా స్పందించాడో చూడండి!

పవన్ వార్నింగ్ ఇచ్చినా... వర్మ ఎలా స్పందించాడో చూడండి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాపై రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా ట్విట్టర్లో రేచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న వివిధ టీవీ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ ఈ విషయమై స్పందించారు. వర్మకు ఫ్రస్ట్రేషన్ అధికమని, అతని వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోబోనని పవన్ కల్యాణ్ ఒక వైపు చెబుతూనే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

'క్రిటిక్స్ చేయాల్సిన పని వేరు. ఫిల్మ్ మేకర్ చేయాల్సిన పని వేరు. వర్మ తోటి ఫిల్మ్ మేకర్ అనుకుంటాను. కాదంటే, నాకూ లోపల వేరే భాష చాలా ఉంది. నేనూ స్ట్రిప్ చేసి, మాట్లాడగలను' అంటూ పవన్ గట్టిగానే రామ్ గోపాల్ వర్మని ఉద్దేశించి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్వూ చూసిన వర్మ...... మరోసారి తనదైన రీతిలో స్పందించారు. 'టీవీ 9 న్యూస్ చానల్ లో వచ్చిన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ చూశాను. నా ఉద్దేశాలను పవన్ సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అతనిపై ఇపుడు మరింత ప్రేమ పెరిగింది' అంటూ ట్వీట్ చేసారు.

స్లైడ్ షోలో వర్మ చేసిన ట్వీట్స్...

పవన్ ఇంటర్వ్యూపై...

పవన్ ఇంటర్వ్యూపై...

‘టీవీ 9 న్యూస్ చానల్ లో వచ్చిన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ చూశాను. నా ఉద్దేశాలను పవన్ సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అతనిపై ఇపుడు మరింత ప్రేమ పెరిగింది' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

అంతకుముందు

అంతకుముందు

అంతకుముందు వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, "సర్దార్ గబ్బర్ సింగ్ ను, రాజా సర్దార్ గబ్బర్ సింగ్ నూ ఓ చిన్నారి చంపేశాడు" అని చెబుతూ, మోగ్లీ చిత్రాన్ని (జంగిల్ బుక్ హీరో) ఉంచాడు. ఆపై పవన్ కల్యాణ్ చిత్రం కన్నా, విదేశీ డబ్బింగ్ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందని, పవర్ స్టార్ ను నిద్ర నుంచి లేపాల్సిన బాధ్యత ఆయన అభిమానులదేనంటూ ట్వీట్ చేసారు.

ఫ్యాన్స్ ఇరిటేషన్

ఫ్యాన్స్ ఇరిటేషన్

రామ్ గోపాల్ వర్మ ట్వీట్లతో ఫ్యాన్స్ ఇరిటేషన్ ఫీలవుతున్నారు.

క్రాష్

క్రాష్

సర్దార్ బాక్సాఫీసు వద్ద క్రాష్ అయిందంటూ వర్మ ట్వీట్

English summary
"Watched Pawan Kalyan's comments on me in TV 9 interview ..Really happy that he understood my true intentions and I love him even more now" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu