‘జన సేన’ సభ ఏర్పాట్లలో ఫ్యాన్స్ బిజీ (ఫోటోలు)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ ఈ నెల 27వ తేదీన విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభను ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడి పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలిసాయి.
మరో వైపు అభిమానులు ఈ సభను విజయవంతం చేసే ఏర్పాట్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏర్పాట్ల గురించి మీడియాకు తెలియజేసేందుకు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఊరూరా తిరుగుతూ సభకు అందరూ తరలిరావాలని చైతన్య పరుస్తున్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
'యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో సాగే ఈ భారీ బహిరంగ సభ....27వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సభలో పార్టీకి సంబంధించిన విధి విధానాలు, లక్ష్యాలు, ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరిస్తారు.

అభిమానుల ప్రెస్ మీట్
27న విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే సభ ఏర్పాట్ల గురించి మీడియాకు వివరిస్తున్న అభిమానులు. అభిమానులే దగ్గరుండి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు.

భారీ బహిరంగ సభ
నోవాటెల్‌లో పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభకావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటి నుంచే పవన్ అభిమానులు, సన్నిహితులు దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

జనసేన
పవన్ కళ్యాణ్ ఫోటోతో వెలసిన పోస్టర్లు. ఇది సామాన్యుడి సేన, ప్రతి ఒక్కరి సేన, ఇది మన సేన, ఇది జన సేన అంటూ పోస్టర్లపై రాసిఉంది.

పవర్ కోసం కాదు..ప్రశ్నించడం కోసం
‘జన సేన' పార్టీ పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసమే అని పవన్ అంటున్నారు. అధికారం తమ లక్ష్యం కాదని, ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకే ఈ పార్టీ పెట్టినట్లు ఆయన తెలిపారు.

ఇజం
యువత కోసం పవన్ ప్రత్యేక శ్రద్ధతో కంపోజ్ చేయించిన గీతంతోపాటు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి ఆయన తన స్నేహితుడు సహకారంతో రచించిన ‘ఇజం' పుస్తకాన్ని ఈ సభలోనే ఆవిష్కరిస్తారు.


Click it and Unblock the Notifications











