ఆ డైరెక్టర్ మూడో సినిమా పవన్ తో సూపర్ డూపర్ హిట్..!
తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా నటిస్తున్న 'కాళీ' (వర్కింగ్ టైటిల్) సినిమా రెండో షెడ్యులు షూటింగు ముగిసింది. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఈ షెడ్యులు జరిగింది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్ ను, హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరించారు. శారాజెన్, అంజలీ లావానియా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అడవి శేషు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా అసలు టైటిల్ని పవన్ కల్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ రెండున ప్రకటిస్తారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తున్న డివివి దానయ్య మరో కొత్త సినిమా కమిట్ కాబోతున్నాడు. బిందాస్, రగడ చిత్రాల డైరెక్టర్ వీరు పోట్ల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీరు పోట్ల చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కి నచ్చడం వెంటనే దానయ్య ఈ సినిమా ప్రొడ్యూస్ చెయ్యడానికి ముందుకు రావడం జరిగిపోయాయి.వీరు పోట్ల డైరెక్ట్ చేసిన బిందాస్ హిట్ అయి, రగడ ఏవరేజ్ గా నిలిచింది. అయితే అతని డైరెక్షన్ లో రాబోయే ఈ సినిమాని డెఫినిట్ గా సూపర్ హిట్ చెయ్యాలనే పట్టుదలతో వున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2012 మధ్యలో ప్రారంభమై 2013లో రిలీజ్ అవుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











