వెంకటేష్, పవన్ ఓ మైగాడ్ అక్టోబర్ 2నే విడుదల
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న మల్టీ సారర్ చిత్రాన్ని మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కథానాయకులుగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి చిత్ర నిర్మాతలు సురేష్ బాబు, శరత్ మరారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుంది.

'ఓ మై గాడ్' చిత్రంలో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో నటించగా.....తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషించనున్నారు. హిందీలో పరేష్ రావల్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. బాలీవుడ్లో ఈచిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెలుగులోనూ ఈచిత్రం సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications











