పవన్-వెంకీ సినిమాకు కొత్త టెన్షన్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో హిందీ సూపర్ హిట్ మూవీ 'ఓ మై గాడ్'కి రీమేక్‌గా తెలుగులో ఓ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి టైటిల్ ఏం పెట్టాలో అర్థం కాక నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకు ముందు 'ఓరి దేవుడా' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ....ఇది అంతగా ఆకర్షణీయంగా లేక పోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'గో గో గోవిందా' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు. దీనికంటే ఆకర్షణీయమైన టైటిల్ గురించి నిర్మాతలు అన్వేషణ సాగిస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది. మరో వైపు ఈ చిత్రానికి దర్శకుడు, హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు.

ఇతర వివరాల్లోకి వెళితే....ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'ఓ మై గాడ్' చిత్రంలో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో నటించగా.....తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషించనున్నారు. హిందీలో పరేష్ రావల్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. బాలీవుడ్లో ఈచిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెలుగులోనూ ఈచిత్రం సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, వెంకటేష్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ ఎప్పటి నుండో కలిసి పని చేయాలనుకుంటున్నారు. అయితే ఇద్దరిక నచ్చే విధంగా కథలు దొకరక పోవడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ మూవీ ఖరారు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్న నిర్మాతలు అందుకు అనుగుణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











