»   » పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు....

పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలు, ఆడియో ఫంక్షన్లకు వీలైనంత దూరంగా ఉంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్ సినిమా ఫంక్షన్లకే ఆయన వెళ్లరు. ఆ మధ్య తన అభిమాని నితిన్ పోరు పడలేక ఆ మధ్య ఓ సారి ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారంతే.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవుడు, కర్నాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం చేస్తూ రూ. 75 కోట్ల బడ్జెట్ తో 'జాగ్వార్' అనే తీసారు. ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని కుమారస్వామి స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు.

Pawan Kalyan

పవన్ వస్తాడని ప్రచారం బాగానే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. ఇటీవల మారిన కొన్ని పరిస్థితులతో ఆయన చాలా బిజీ అయ్యారు. ఈ విషయమై కుమారస్వామికి పవన్‌ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

అనివార్య కారణాల వల్ల ఈ ఆడియో ఫంక్షన్‌కు రాలేకపోతున్నానని, ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ జరిగితే తప్పక వస్తానని చెప్పాడట. దీనికి వెంటనే కుమారస్వామి బదులిస్తూ సినిమా విడుదలైన వారంలోపే విశాఖలో సక్సెస్‌మీట్‌ నిర్వహిస్తామని, దానికి తప్పకుండా రావాలని చెప్పారట కుమారస్వామి.

English summary
Power star Pawan Kalyan will attend Jaguar movie success meet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu