»   »  ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన బ్రహ్మానందం

ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన బ్రహ్మానందం

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం నటుడిగా తన ప్రయాణంలో 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకూ ప్రేక్షకులకు వినోదం పంచుతూనే ఉంటానని స్పష్టం చేసారు. నవ్వించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన వరంగా పేర్కొన్న బ్రహ్మానందం....దీన్ని ఆపే ప్రసక్తే లేదని, ఊపిరి ఉన్నంత కాలం నవ్విస్తూనే ఉంటానని తెలిపారు.

  1986లో విడుదలైన 'చంటబ్బాయ్' బ్రహ్మానందం నటించిన తొలి చిత్రం. ఆ చిత్రం విడుదలకు రెండేళ్ల ముందే బహ్మీ సినిమా రంగంలో ప్రవేశించారు. నట ప్రస్థానంలో 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పరిశ్రమలో తాను ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో మంది సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బ్రహ్మానందం తెలిపారు.

  I'll Never Stop Entertaining Audiences: Brahmanandam

  బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఫిబ్రవరి 1, 1956న గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్లలో జన్మించారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందేవారు. 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది.

  ఇప్పటికే 950కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన త్వరలో 1000 చిత్రాల మార్కును దాటబోతున్నారు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం ప్రత్యేకత. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

  English summary
  Telugu comedian Brahmanandam, who recently completed three decades in the industry, says he will continue to entertain audiences till the sky and earth last. He said he is indebted to every single member of Telugu filmdom. Brahmi, who started his career with a brief role in Jandhyala's 1986 Telugu comedy Chantabbai, has starred in over 1,000 films.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more