పవర్ స్టార్ బర్త్ డే కానుకగా ‘పవనిజం’
హైదరాబాద్: శ్రీ లక్ష్మి వెంకట సాయి క్రియేషన్స్ పతాకంపై మహేష్, నరేష్ నిర్మిస్తున్న చిత్రం 'పవనిజం'. ఈ చిత్రం ద్వారా ఇ.కె.చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మధు, సుధీర్, ఇషా, జయంతి, హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ అభిమానులు తలుచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో అనేది ఈ చిత్ర కథాంశం.

ఈ మూవీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మహేష్, నరేష్ మాట్లాడుతూ పవనిజం ఆడియో విడుదలై మంచి సక్సెస్ సాధించిందన్నారు. చిత్ర నిర్మాణంలో పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేమని అన్నారు. పవన్ ఫ్యాన్స్ కి పవనిజం కచ్చితంగా ఒక మరువలేని గిఫ్ట్ అవుతుంది. నిజమైన అభిమానులు సమాజానికి ఎలాంటి సేవ చేస్తే తమ అభిమాన హీరోకి పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఈ మూవీతో చెప్పామని అన్నారు.
సినిమా పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారనీ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. ఈ మూవీని ఇ.కె.చైతన్య ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క అందించిన స్వరాలు మంచి ఆదరణ పొందుతున్నాయన్నారు.


Click it and Unblock the Notifications











