‘పవనిజం’ జెండాతో వస్తున్నారు, ఫ్యాన్సే హిట్ చేస్తారు!
హైదరాబాద్: ఈ మధ్య కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే చాలు హిట్టవుతున్నాయి. నితిన్ లాంటి పవన్ అభిమానులు.... పవన్ కళ్యాణ్ సినిమాలోని పాటను తమ సినిమాలో పెట్టేసుకొని హిట్టు కొట్టేస్తున్నారు. ఇలా సినిమాలు హిట్టవుతున్నాయంటే కారణం పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్టే. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల అభిమతం అయిన‘పవనిజం' కాన్సెప్టే సినిమా కథగా మారితే ఎలా ఉంటుంది. అలాంటి ఆలోచనలోంచి వచ్చిందే ‘పవనిజం' సినిమా. ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతోంది.
శ్రీవెంకటసాయి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై మహేష్, నరేష్, సురేష్ నిర్మిస్తున్న చిత్రం పవనిజం. ఈ చిత్రం ద్వారా వి.కె.చైతన్య దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మధు, సుధీర్, ఇషా, జయంతి హీరోహీరోయిన్లుగా సుమన్, పోసాని, కాశీవిశ్వనాధ్, ఆలీ, సప్తగిరి తదితరులు ఇతరపాత్రల్లో నటిస్తున్నారు.

పవన్ అభిమానులు తలుచుకుంటే సమాజాన్ని ఏ విధంగా మార్చగలరో తెలియజెప్పే చిత్రం ఇది. ఈ చిత్రంలో ఎంఎల్‌ఏ క్యారెక్టర్ చేస్తున్న పోసానికి మంచి పేరు వస్తుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యుల అభినందనలు అందుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో రూపొందింది.
పవన్ కళ్యాణ్‌లోని సామాజిక స్ఫూర్తి ఆయన ఫ్యాన్స్ కు ఎలా ఉత్తేజం ఇస్తుందో...అలాంటి ఉత్సాహంతో ఫ్యాన్స్ తలుచుకుంటే సమాజానికి ఎలాంటి మంచి పనులు చేయవచ్చో తెలియజెప్పే కథాంశం ఈ చిత్రానికి హైలెట్ అని నిర్మాతలు తెలియజేశారు. సంగీత దర్శకుడిగా కనిష్క అద్భుతమైన పాటలను అందించారు. ఆనంద్‌డోల సినిమాటోగ్రఫీ, సత్య ఎడిటింగ్ వహించారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : ఇ.కె.చైతన్య.


Click it and Unblock the Notifications











