పవర్ స్టార్ ‘పవనిజం’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పవనిజం'పై ఓ పాట ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట రిలీజ్ డేట్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఈ సాంగును రిలీజ్ చేయబోతున్నారు.
తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఉదారగుణం, స్టైల్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పట్ల... అభిమానులు ఎంతో గర్వంగా ఫీలవుతూ ఉంటారు. అలాంటి స్టార్ కోసం పాడుతున్న పాటను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబా సెహగల్ తానే స్వయంగా లిరిక్స్ రాసి మరీ దీన్ని కంపోజ్ చేసారు.
పవర్ స్టార్ అభిమానులకు కలకాలం గుర్తిండి పోయేలా... మంచి జోష్‌తో కూడి ఈ పాట ట్యూన్స్ ఉండనున్నాయి. ఇందులో ఇప్పటి వరకు పవన్ నటించిన సినిమాల పేర్లతో పాటు, అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలను తెలియ పరుచనున్నారు. అదే విధంగా అభిమానులంటే పవన్ ఎంత విలువిస్తారో కూడా ఇందులో పొందు పరుచనున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సర్కిల్లో 'పవ పవ పవ పవన్ కళ్యాణ్.. పవ పవ పవ పవన్ కళ్యాణ్' అనే లిరిక్స్ తో కూడిన సాంగ్ ఒకటి చక్కర్లు కొడుతోంది. మరి బాబా సెహగల్ కంపోజ్ చేసిన 'పవనిజం' సాంగు ఎలా ఉండబోతోందో చూడాలి. ఇంతకు ముందు బాబా సెహల్ జల్సా, గబ్బర్ సింగ్ చిత్రాలకు పాడిన పాటలు బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











