పవన్ కళ్యాణ్ ని కలిసి బ్లెస్సింగ్స్ (ఫొటో)

By Srikanya

హైదరాబాద్: చాలా మంది చిన్న హీరోలు తమ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ పేరు వాడుకుని కలెక్షన్స్ సంపాదించాలని చూస్తున్నారు. దాంతో మేము ఏం తక్కువ అనుకున్న కొంతమంది పవన్ అభిమానులు పవనిజం టైటిల్ తో ఓ చిత్రం తీసారు. తమ చిత్రం పవన్ కళ్యాణ్ కు ట్రిబ్యూట్ అని చెప్తున్నారు. సెప్టెంబర్ 26న చిత్రం విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం దర్శకుడు, నటులు కలిసి పవన్ కళ్యాణ్ ని మీట్ అయ్యి..ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అంతేకాకుండా ఆయన ఫొటోలు ప్రమోషన్ లో వాడుకోవటానికి ఫర్మిషన్ తీసుకున్నారు.

శ్రీవెంకటసాయి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై మహేష్‌, నరేష్‌, సురేష్‌ నిర్మిస్తున్న చిత్రం పవనిజం. ఈ చిత్రం ద్వారా వి.కె.చైతన్య దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మధు, సుధీర్‌, ఇషా, జయంతి హీరోహీరోయిన్లుగా సుమన్‌, పోసాని, కాశీవిశ్వనాధ్‌, ఆలీ, సప్తగిరి తదితరులు ఇతరపాత్రల్లో నటిస్తున్నారు.

పవన్‌ అభిమానులు తలుచుకుంటే సమాజాన్ని ఏ విధంగా మార్చగలరో తెలియజెప్పే చిత్రం ఇది. ఈ చిత్రంలో ఎంఎల్‌ఏ క్యారెక్టర్‌ చేస్తున్న పోసానికి మంచి పేరు వస్తుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్‌ జారీ చేశారు. సెన్సార్‌ సభ్యుల అభినందనలు అందుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో రూపొందింది.

పవన్‌ కళ్యాణ్‌లోని సామాజిక స్ఫూర్తి ఆయన ఫ్యాన్స్ కు ఎలా ఉత్తేజం ఇస్తుందో...అలాంటి ఉత్సాహంతో ఫ్యాన్స్‌ తలుచుకుంటే సమాజానికి ఎలాంటి మంచి పనులు చేయవచ్చో తెలియజెప్పే కథాంశం ఈ చిత్రానికి హైలెట్‌ అని నిర్మాతలు తెలియజేశారు. సంగీత దర్శకుడిగా కనిష్క అద్భుతమైన పాటలను అందించారు. ఆనంద్‌డోల సినిమాటోగ్రఫీ, సత్య ఎడిటింగ్‌ వహించారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : ఇ.కె.చైతన్య.

Pawanism team Meets Pawan Kalyan

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X