చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ పాట పాడిన మార్కెట్లో కొచ్చింది. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచార ఆడియో క్యాసెట్ ని యువరాజ్యం అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ దీనిని విడుదల చేసారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ ఆడియోలో పదిపాటలు ఉన్నాయి.పార్టీ ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ ఠాగూర్ మధు,ప్రచార కార్యదర్శి ఏడిద శ్రీరామ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ పాటల్లో తొమ్మిది అనంత్ శ్రీరామ్ రాశారు. ఒక్కటి మాత్రం వేటూరి రాశారు. ఇక రామ్ చరణ్ పాడిన పాట ప్రత్యేకంగా ఉంటుందని పవన్ అదో విశేషమని పేర్కొన్నారు. ఇక పాటల్లో ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు ఉంటాయా అన్న ప్రశ్నకు ఎవరినో విమర్శించి ఓట్లు పొందాల్సిన అవసరంలేదని,తాము ఓట్లకన్నా మార్పు కోసం పనిచేస్తున్నామని పవన్ అన్నారు.