పవన్ ఆస్తుల పై ఫేసు బుక్ లో రచ్చ

ఇంటర్నెట్‌లో లీక్ అయినట్లు చెప్పబడుతున్న పవన్ ఆస్తుల జాబితా ఇది...
నగదు: 89 వేలు, బ్యాంక్ డిపాజిట్లు - 3,13,29,229, ఇతర డిపాజిట్లు-4,13,54,423, జీవిత బీమా పాలసీలు, డిపాజిట్లు-40,31,000; బాండ్లు, డిబెంచర్లు-4,55,207, మ్యుచువల్ ఫండ్స్- 1,43,29,105, ఫైనాన్స్ కంపెనీల్లో నిల్వ-2,90,000. రెండు బైక్‌లు - 20,31,409, రెండు బెంజ్ కార్లు- 1,86,79,149, స్కోడా కారు-27,67,208, బంగారు -80,000, యంత్రాలు-23,58,863, భార్య అన్నా లెజ్‌నెవా ఆస్తులు-74,548, ముగ్గురు పిల్లల పేరిట ఉన్న ఆస్తులు-17,10,106. అప్పులు-5,81,99,129 మొత్తంగా పవన్ కల్యాణ్ ఆస్తుల విలువ... రూ.17,77,78,376.
ఇక జనసేన పార్టీనేత పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్‌లో నరేంద్రమోడీతో పవన్‌కల్యాణ్ భేటీకానున్నారు. భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాజ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం భేటీ కానున్నారు. పవన్ గురువారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. సాధారణ ఎన్నికల వ్యూహం, రాష్ట్రంలో తెదేపా, భాజపా, జనసేనల మధ్య అవగాహన వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











