For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhavadeeyudu Bhagat Singh: భవదీయుడు భగత్ సింగ్‌గా పవన్ కల్యాణ్.. మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో హరీష్ శంకర్

  |

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ కాంబినేషన్‌లో మరో పవర్ ప్యాక్ మూవీ టాలీవుడ్‌లో సాక్షాత్కరించబోతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు హరీష్
  శంకర్ రూపొందిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ సినిమా ఎప్పడు సెట్స్‌పైకి వెళ్తుందా? ఎప్పుడు ప్రేక్షకలు ముందుకు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ శుభవార్తను అందించారు. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ సినిమా గురించిన విశేషాల్లోకి వెళితే...

  పవన్ కల్యాణ్ 28వ సినిమా టైటిల్

  పవన్ కల్యాణ్ 28వ సినిమా టైటిల్

  పవన్ కల్యాణ్‌తో తీయబోయే సినిమా గురించి టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నామని హరీష్ శంకర్, చిత్ర యూనిట్ వెల్లడించగానే.. అభిమానుల్లో జోష్ మొదలైంది. వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆకాశమంత ఆనందం ఫ్యాన్స్‌లో కనిపించింది.

  గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత

  గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత

  గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మూవీ అనగానే.. టాలీవుడ్‌లోను, బాక్సాఫీస్ వద్ద ప్రకంపనాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ సినిమాకు ఏం టైటిల్ పెడుతారా అనే విషయంపై రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో సంచారి లేదా భవదీయుడు భగత్ సింగ్ అంటూ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో అభిమానుల్లో పెరిగిపోతున్న క్యూరియాసిటీకి తెర దించేందుకు హరీష్ శంకర్ రంగంలోకి దిగారు. గురువారం 9.45 నిమిషాలకు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటన చేశారు.

  పవన్, హరీష్ టైటిల్, లుక్ ఎలా ఉందంటే..

  పవన్, హరీష్ టైటిల్, లుక్ ఎలా ఉందంటే..

  గురువారం రోజున రిలీజ్ చేసిన భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్, టైటిల్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది. పవన్, హరీష్ రేంజ్‌లోనే ఉందనే రిలీజైన సెకన్లలోనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నంబర్ 1గా ట్రెండ్ అవుతున్నది. దిల్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ సినిమా ఎలా ఉండబోతుందో హరీష్ శంకర్ చెప్పకనే చెప్పారు.
  ఒక డైనమైట్ లాంటి హీరో మీద, మరో డైనమైట్ లాంటి పేరు పెట్టి చిత్రం మీద ఉత్సుకతను, అంచనాలను మరింతగా పెంచారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది అని తెలుపుతూ తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అన్న విషయాన్ని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ స్పష్టం చేశారు.

  పవర్ ఫుల్ కటౌట్ కోసం పవర్‌ఫుల్ టైటిల్

  పవర్ ఫుల్ కటౌట్ కోసం పవర్‌ఫుల్ టైటిల్


  భవదీయుడు..! భగత్ సింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆకర్షణగా కనిపించింది. ఖరీదైన బైక్‌పై ఓ చేతిలో మైక్, మరో చేతిలో చాయ్ గ్లాస్‌తో స్టైలిష్‌గా పవన్ కల్యాణ్ కనిపించాడు. బ్యాక్ డ్రాప్‌లో ఇండియా గేట్‌ను చూపించడంతో దేశ రాజధాని నేపథ్యంగా కథ సాగుతుందనే హింట్ ఇచ్చారా అనే సందేహం కలిగింది. పవర్ ఫుల్ కటౌట్ కోసం పవర్‌ఫుల్ టైటిల్ అని చిత్ర యూనిట్ ముందే అభిమానుల్లో జోష్ పెంచింది.

  Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu
  చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: పవన్ కల్యాణ్, పూజా హెగ్డే తదితరులు
  దర్శకత్వం: హరీష్ శంకర్
  నిర్మాతలు: నవీన్, రవిశంకర్
  సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
  సినిమాటోగ్రఫి: అయనంకా బోస్
  ఆర్ట్: ఆనంద్ సాయి
  ఎడిటర్: చోటా కే ప్రసాద్
  ఫైట్స్: రామ్ లక్ష్మణ్
  సీఈవో: చెర్రీ
  బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
  పీఆర్వో: వేణుగోపాల్

  English summary
  Power Star Pawan Kalyan and Harish shankar movie title is . Mythri movie makers anounced their project as
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X