ప్రపంచం ఆర్ధిక సంక్షోభంలో కొట్టుకపోతేనేం స్టార్ హీరోలు,హీరోయిన్స్ హ్యాపీగా తమ భారీ రెమ్యునేషన్స్ మాత్రం తగ్గించుకోరంటూ...ఆ మధ్య మీడియాలో వచ్చిన వార్తలను బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్ తోసిపుచ్చారు.ప్రస్తుతం దేశంలోనే అందరికంటే తానే అతి తక్కువ పారితోషికం తీసుకుంటున్నాని చెప్పారు. ''నేనూ ఎకనామిక్స్ చదివిన విద్యార్థినే. నా విలువెంతో నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం దేశంలో తక్కువ పారితోషికం తీసుకుంటుంది నేనే. లాభాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఓ కాంట్రాక్టు మీద సంతకం చేస్తా అంతే! ఏడాది చివర్లో 'ఇదిగో నీవద్ద ఇంత డబ్బుంది' అని అకౌంటెంట్లు చెబుతారు. ఓం శాంతి ఓం చిత్రానికి రూ.6 కోట్లు తీసుకున్నా. కానీ 'చక్ దే ఇండియా' కేవలం రూ.2.5 కోట్లకే చేశా. ఇంకా తగ్గించుకోవాలని మీరు చెబితే అందుకు సిద్ధంగా ఉన్నాను'' అని షారుక్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.