ఏంటి మహేష్ బాబు ఎవరో తెలీదా.. కచ్చితంగా ఇడియటే.. హీరోయిన్ రిప్లై అదుర్స్!!

ప్రయాణం, ఊసరవెల్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్ ఘోష్.. ఈ మధ్య తెగ వార్తల్లో నిలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్- మీరా చోప్రా వివాదం, సుశాంత్ సింగ్ మరణం, నెపోటిజం, బాలీవుడ్, టాలీవుడ్ అంటూ సంచలన కామెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. లాక్ డౌన్ సమయంలో ఆమె తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేయడం, పలువురి హీరోలపై తన అభిప్రాయాన్ని చెప్పడం ఇలా తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది.

 ఎన్టీఆర్‌‌పై అమితమైన ప్రేమ..

ఎన్టీఆర్‌‌పై అమితమైన ప్రేమ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా వివాదం ఓ రేంజ్‌లో జరుగుతుండగా పాయల్ ఎన్టీఆర్‌‌ను ఆకాశానికి ఎత్తేసింది. మహిళలను ఎంతో గౌరవిస్తాడని ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చింది. పైగా ఎన్టీఆర్ వారసత్వం మీద, నెపోటిజం మీద నిలబడ్డ హీరో కాదని కితాబిచ్చింది.

 నిత్యం ఏదో ఒకటి..

నిత్యం ఏదో ఒకటి..

లాక్ డౌన్ సమయంలో నిత్యం ఏదో ఒక విషయంపై పాయల్ ఘోష్ స్పందిస్తూ ఉండేది. ఇక సుశాంత్ ఆత్మహత్య అనంతరం అయితే మరింత ఎమోషనల్ అయింది. తాను కూడా డిప్రెషన్ స్థితిలోకి వెళ్లి వచ్చానని, అయితే చావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని వెల్లడించింది.

టాలీవుడ్ గొప్పదనం..

టాలీవుడ్ గొప్పదనం..

టాలీవుడ్, దక్షిణ సినీ పరిశ్రమ గొప్పదనాన్ని పలు సందర్భాల్లో పాయల్ కీర్తించింది. అమ్మాయిలకు బాలీవుడ్‌లో గౌరవం, విలువ ఇవ్వరని అదే దక్షిణాదిలో మాత్రం ఎంతో గౌరవంగా చూసుకుంటారని, అలాంటి టాలీవుడ్‌ను వదులుకుని నరకం లాంటి బాలీవుడ్‌కు వచ్చినందుకు ఎన్నో సార్లు బాధపడ్డానని చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ నెటిజన్..

తాజాగా ఓ నెటిజన్..

తాజాగా ఓ నెటిజన్ పాయల్‌కు ఓ సూచన చేశాడు. ఓ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నట్టుగా పాయల్ దృష్టికి తీసుకొచ్చాడు. సదరు మీడియా కథనం ప్రకారం.. పాయల్ ఘోష్‌కు మహేష్ బాబు ఎవ్వరో తెలీదంటా. ఆ కథనంపై పాయల్ స్పందిస్తూ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
 మహేష్ బాబు తెలీదా..

మహేష్ బాబు తెలీదా..

పాయల్ ఘోష్ స్పందిస్తూ.. ‘దయచేసి తప్పుడు వార్తలు ప్రచురించవద్దని మీడియాను కోరుతున్నా..మహేష్ బాబు ఎవరో తెలీదని నేను ఎప్పుడు అనలేదు.. ఒక వేళ ఆయన తెలియదని చెబితే నేనో ఇడియట్‌ని అవుతాను.. పైగా టాలీవుడ్‌లో నాకిష్టమైన హీరోల్లో ఆయన ఒకరు.. ప్రేమను, పాజిటివిటీని పంచండ'ని కోరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X