twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపుతామని బెదిరింపులు.. ప్రాణాలకు రక్షణ కరువు.. అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ఫిర్యాదు

    |

    బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై అత్యాచార, లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి విరుచుకుపడ్డారు. తన ఫిర్యాదుపై ముంబై పోలీసులు స్పందించకుండా తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఫిర్యాదు చేసినా అనురాగ్ కశ్యప్‌పై చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసి అసహనాన్ని వ్యక్తం చేశారు. అనురాగ్‌పై ఆమె చేసిన ఫిర్యాదు ఏమిటంటే..

    అనురాగ్ కశ్యప్‌ను ఒక్కసారి కూడా

    అనురాగ్ కశ్యప్‌ను ఒక్కసారి కూడా

    అనురాగ్ కశ్యప్‌పై తాను ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదు అనంతరం ఆయనను ఒక్కసారి కూడా విచారణకు పిలువలేదు. కానీ నా ఫిర్యాదు తర్వాత నన్ను చాలాసార్లు పిలిచారు. ఆయన మాత్రం ఇంట్లో నుంచి కదలకుండా కూర్చొన్నారు అని పాయల్ ఘోష్ తెలిపారు.

    నీ అంతు చూస్తామని బెదిరింపులు

    నీ అంతు చూస్తామని బెదిరింపులు

    అనురాగ్ కశ్యప్‌పై ఫిర్యాదు తర్వాత నా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. బయటకు రావాలంటే భయంగా ఉంది. నీ అంతు చూస్తామని అనురాగ్ కశ్యప్, ఆయన వర్గం బెదిరింపులకు పాల్పడుతున్నది. జాగ్రత్తగా ఉండు.. ఏ క్షణంలోనైనా నీ మీద దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. నాకు రక్షణ కల్పించండి అంటూ పాయల్ ఘోష్ వేడుకొన్నారు.

     పాయల్ ఘోష్ లాయర్ అసహనం

    పాయల్ ఘోష్ లాయర్ అసహనం

    ఇదిలా ఉండగా, పాయల్ ఘోష్‌కు ఎదురవుతున్న వేధింపులపై ఆమె తరఫు న్యాయవాది స్పందించారు. అనురాగ్ కశ్యప్‌పై ఫిర్యాదు చేస్తే ఆయనను ఒక్కసారి కూడా వెర్సోవా పోలీసులు పిలువలేదు. కానీ నా క్లయింట్‌ను మాత్రం ప్రతీ రోజు విచారణ పేరుతో పిలుస్తున్నారు. బాధితురాలిని విచారించడం ఎక్కడైనా ఉంటుందా? స్థలం గుర్తింపు కోసం తనను రేప్ చేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల పేరుతో ఆరు, ఏడు గంటలు కూర్చోపెడుతున్నారు అని లాయర్ పేర్కొన్నారు.

    Recommended Video

    #PayalGhosh : Anurag Kashyap Responds To Payal Ghosh's Comments || Oneindia Telugu
    వైద్య పరీక్షల పేరుతో వేధింపులు

    వైద్య పరీక్షల పేరుతో వేధింపులు

    వైద్య పరీక్షల పేరుతో నా క్లయింట్‌ను వేధిస్తున్నారు. మూడు రోజులుగా పిలిచి ఎలాంటి పరీక్షలు జరిపించకుండా పంపించేస్తున్నారు. పోలీస్ కంప్లయింట్ ఇవ్వడానికి రెండుసార్లు వెళ్లాం. తొలి రోజు ఓషియారా పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ కేసును వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇదంతా వేధింపుల్లో భాగమే. ఈ కేసులో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై బహిరంగంగా నా నిరసనను వ్యక్తం చేశానని పాయల్ ఘోష్ లాయర్ తెలిపారు.

    English summary
    Heroine Payal Ghosh and His lawyer alleges director Anurag Kashyap and Versova Polices once again: Paya Ghosh said that He and his lobby threatening. I am scared to come out alone in this situations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X