పడుకోమని బలవంతం చేశాడు.. రూమ్‌లో రేప్... అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ఆరోపణలు
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. నాపై రేప్‌కు పాల్పడ్డారని దారుణమైన ఆరోపణలు చేశారు. మీ టూ ఆరోపణలు సద్దుమణియాయని ఆందరూ అనుకొంటున్న తరుణంలో పాయల్ ఘోష్ ఆరోపణలు ఇప్పడు బాలీవుడ్‌లో కలకలం రేపాయి. పాయల్ రాజ్‌పుత్ ఆరోపణలు ఏమిటంటే..

ప్రధాని మోదీకి ఫిర్యాదు
అనురాగ్ కశ్యప్‌పై లైంగికదాడి ఆరోపణలు చేస్తూ పాయల్ ఘోష్ ట్వీట్ చేశారు. ఏకంగా ప్రధాని మోదీకి, పీఎంవోకు ఫిర్యాదు చేయడం మరింత సంచలన రేపింది. ఈ డైరెక్టర్ రూపంలో ఓ రాక్షసుడు ఉన్నారు. ఈయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. నా ప్రాణాలు, భద్రతకు ముప్పు ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి అంటూ పాయల్ ఘోష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాపై అత్యాచారానికి ప్రయత్నించారు
అవకాశాల కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో నన్ను అనురాగ్ కశ్యప్ తన రూమ్‌కు రమ్మని చెప్పారు. ఆయన ఇంటికి వెళితే నన్ను అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. తాను రెండు సార్లు తనతో దారుణంగా ప్రవర్తించారు. ఆయన రూమ్‌లో డ్రగ్స్ ఉండటం చూశాను. కరణ్ జోహర్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు నాకు క్లోజ్ అని చెప్పి నన్ను బలవంతంగా లోబరుచుకోవాలని చూశాడు అని పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేశారు.

నాతో పడుకోమని బలవంతం
బాంబే వెల్వెట్ సినిమా తీస్తున్నప్పుడు రణ్‌బీర్ కపూర్ పక్కన నటించే పాత్ర ఉందని చెప్పారు. ఆ పాత్ర కోసం ప్రయత్నిస్తూ నాతో పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాతో పనిచేసిన వాళ్లందరూ ఇలా నాతో పడుకొన్నారు. నువ్వు కూడా నాతో పడుకో అని అన్నారు. నాపై దాదాపు రేప్ చేసేంత పని చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీపై యాసిడ్ దాడి చేస్తారని హెచ్చరించారు. ఇది 2015లో జరిగింది అని అన్నారు.
Recommended Video

జాతీయ మహిళా కమిషన్ స్పందన
పాయల్ ఘోష్ ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మీరు ఫిర్యాదు చేయండి. మేము దర్యాప్తు చేస్తామని జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ ట్వీట్‌కు బదులిచ్చారు. పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదును పంపమని ట్వీట్‌లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











