అనురాగ్‌కు శిక్ష పడాల్సిందే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పాయల్ ఘోష్ ఫిర్యాదు

దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చేసిన లైంగిక ఆరోపణల విషయంలో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదనే స్పష్టమవుతున్నది. కొన్నేళ్ల క్రితం తనపై అత్యాచారం చేయబోయాడని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదని అనిపిస్తోంది. మరోవైపు అనురాగ్ కశ్యప్ కూడా ఆమెకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సారి పాయల్ ఘోష్ ఈ వివాదంలో పొలిటికల్ లీడర్స్ నుంచి కూడా మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలువడం చర్చనీయాంశమైంది.

Recommended Video

Payal Ghosh Met Telangana Leader & Central Minister Kishan Reddy || Oneindia Telugu
NCW ఆఫీస్ లో కంప్లైంట్

NCW ఆఫీస్ లో కంప్లైంట్

ఇదివరకే సోషల్ మీడియా ద్వారా పాయల్ ఘోష్ ప్రధాని మోదికి ట్విట్టర్ ద్వారా తనపై లైంగిక దాడి జరిగిందని పిర్యాదు చేసింది. ఆ వివాదంపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా స్పందించారు. వెంటనే పిర్యాదు చేయవల్సిందిగా వారు కోరగా పాయల్ రీసెంట్ గా ఢిల్లీ NCW ఆఫీస్ లో కంప్లైంట్ చేసింది. అందుకు సంబంధించిన న్యూస్ కూడా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 కిషన్ రెడ్డి మద్దతు కోరిన పాయల్

కిషన్ రెడ్డి మద్దతు కోరిన పాయల్

ఇక ఇప్పుడు పాయల్ ఘోష్ పొలిటికల్ లీడర్స్ సహాయం కోరుతోంది. బుధవారం ఉదయం బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డినిపాయల్ ఘోష్ కలిశారు. కిషన్ రెడ్డికి తనకు జరిగిన అన్యాయం గురించి లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చి.. వెంటనే ప్రభుత్వం తరపున జోక్యం చేసుకోవాలని కోరింది. వీలైనంత త్వరగా తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

వెనక్కి తగ్గని పాయల్ ఘోష్

వెనక్కి తగ్గని పాయల్ ఘోష్

పాయల్ ఫిర్యాదును నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్ల్యు) సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో పాయల్ ఘోష్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకు న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళతానని ఛాలెంజ్ చేస్తోంది. ఇక ఆమెకు కంగనా రనౌత్ లాంటి కొందరు మద్దతు అందిస్తున్నారు. ఇక మరోవైపు పాయల్ చేస్తున్న కామెంట్స్ కి విరుద్ధంగా స్పందిస్తూ అనురాగ్ కశ్యప్ కి సపోర్ట్ చేస్తున్నారు.

ఒక్క సాక్ష్యమైనా ఉందా?

ఒక్క సాక్ష్యమైనా ఉందా?

ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, తాప్సి పన్ను వంటి వారు అనురాగ్ కి డైరెక్ట్ గా మద్దతు తెలిపారు. ఇక అనురాగ్ కశ్యప్ పాయల్ ఘోష్ చేస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఆమె కావాలని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, తాను ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని అంటున్నారు. నేను తప్పు చేశానని ఒక్క సాక్ష్యం అయినా చూపించమని చెప్పండి అంటూ.. ఆమెపై దాడి చేసినట్లు చెబుతున్న రోజున తాను ఇండియాలోనే లేనని శ్రీలంకలో ఉన్నానని అనురాగ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X