జూ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్న పాయల్..!?
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పై అందాల సుందరి పాయల్ ఘోష్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'ప్రయాణం" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టిన ఈ భామకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. కలకత్తాలో పుట్టి పెరిగిన ఈమె నటించిన తొలిచిత్రం కమర్షియల్ గా అనుకున్నంత విజయాన్ని సాధించకపోయినా... ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తొలిచిత్రంలో పద్ధతిగా కనిపించి మలిచిత్రం 'మిస్టర్ రాస్కెల్" లో యదేచ్ఛగా అందాలు ఆరబోసినా సరైన ఫలితం దక్కలేదు.
ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ సరసన 'ఊసరవెల్లి" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో తనది రెండో కథానాయిక పాత్ర అయినా అభినయంతో పాటు గ్లామర్ కు ఆస్కారమున్న పాత్ర దొరికిందని సంతోషంతో ఉబ్బితబ్బిబవుతోంది. జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి లాంటి క్రేజీ కలయికతో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెబుతోంది.
'ఊసరవెల్లి" హీరో జూ ఎన్టీఆర్ గురించి ఈ తార మాట్లాడుతూ 'ఎన్టీఆర్ ఎనర్జీ నాకెంతో నచ్చింది. ఆయన డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటన అంటే అతనికి ప్రాణం. ఎలాంటి కష్టతరమైన హావాభావాలనైనా సింగిల్ పలికించగలడు" అంటూ చెప్పుకొచ్చింది. 'ఊసరవెల్లి" చిత్రం తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడుతుందని, నాయికగా బిజీ అవుతానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది పాయల్ ఘోష్...


Click it and Unblock the Notifications











