అలాంటి సీన్లు చేసే ధైర్యం ఉంది: ఆర్ఎక్స్100 హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

By Bojja Kumar

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్‌ఎక్స్100' బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమా కథతో పాటు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే బోల్డ్ సీన్లను ప్రజంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఘాటైన ముద్దు సీన్లలో ఎలాంటి మొహమాటం లేకుండా తెగింపుగా నటించడం కూడా ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది. తను చేసిన ఈ సీన్ల గురించి పాయల్ మీడియా ముందు బోల్డ్‌గా స్టేట్మెంట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.

Recommended Video

RX 100 Movie Hero Talks About Heroine Payal
అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడమే ఓ సాహసం

అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడమే ఓ సాహసం

వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఒప్పుకోవడమే ఓ సాహసం లాంటిది. ముద్దు సీన్లు, రొమాంటి సీన్లు మాత్రమే కాదు.... క్యారెక్టర్ కూడా నెగెటివ్ షేడ్స్‌లో ఉండటం వల్లా చాలా మంది హీరోయిన్లు తమ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడి చేయడానికి నో చెప్పారు.

ధైర్యంగా ముందుకు వచ్చిన పాయల్

ధైర్యంగా ముందుకు వచ్చిన పాయల్

తన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నా.... ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయాల్సి ఉన్నా పాయల్ ధైర్యంగా ముందుకు వచ్చిందట. ఒక వేళ ఈ పాత్రను ఆమె కాకుండా మరెవరు చేసినా ఇంత బాగా చేసుండేవారు కాదేమో అనేంతలా ఆమె అదరగొట్టింది.

తనలో ఆ ధైర్యం ఉంది అని అంటున్న పాయల్

తనలో ఆ ధైర్యం ఉంది అని అంటున్న పాయల్

నెగెటివ్ పాత్ర పోషించినప్పటికీ ... తన పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంపై పాయల్ సంతోషం వ్యక్తతం చేసింది. ఇలాంటి బోల్డ్ డేరింగ్ క్యారెక్టర్లు చేయాలంటే.. చాలా దైర్యం, సాహసం ఉండాలని... అవి తనలో ఉన్నాయి కాబట్టే ఏ మాత్రం భయపడకుండా ఓకే చెప్పానని పాయల్ స్పష్టం చేసింది.

 బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న ఆర్ఎక్స్100

బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న ఆర్ఎక్స్100

కాగా... ‘ఆర్ఎక్స్ 100' మూవీ బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. తొలి మూడు రోజుల్లో రూ. 3.76 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ. 2.70 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవ్వగా తొలి 3 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X