నాలుగు రోజులక్రితమే ఒకడొచ్చాడు, కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్లో ఉంది: ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ సంచలనం
Recommended Video

శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ సమస్య తగ్గిందని అంతా అనుకుంటున్నారు. కానీ ఇంకా కొనసాగుతోందని ఆర్ఎక్స్ 100 హీరోయిన్ మాటలను బట్టి స్పష్టం అవుతుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్ పుత్‌కు... ఆ సినిమా విజయం తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే అందులో కొందరు కాంప్రమైజ్ అయితే అవకాశం ఇస్తామనే ప్రపోజల్స్‌తో వస్తున్నారట. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల తర్వాత కూడా టాలీవుడ్లో ఇంకా ఈ జాడ్యం కొనసాగుతుండటం విస్మయానికి గురి చేస్తోంది.

టాలీవుడ్లో ఇలాంటివి చూసి డిసప్పాయింట్ అయ్యా
ఓ ప్రముఖ మీడియా గ్రూఫుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ... ‘తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేస్తోంది. ‘ఆర్‌ఎక్స్100' పెద్ద హిట్టయి, నాకు పేరొచ్చిన తర్వాత కూడా నన్ను కాంప్రమైజ్ అవ్వమంటూ అడుగుతున్నారు. ఈ విషయాన్ని తప్పకుండా పబ్లిష్ చేయండి.' అని నొక్కి వక్కానించారు.

నాలుగు రోజుల క్రితమే ఒకడు వచ్చాడు
కాంప్రమైజ్ అయితే అవకాశం ఇస్తాం అనే ప్రపోజల్‌తో నాలుగు రోజుల క్రితమే ఒకడు కలిశారు. వారికి నేను ఒకటే చెబుతున్నాను. నేను ఇక్కడ టాలెంట్‌తో ఈ పొజిషన్‌లో ఉన్నాను. కాంప్రమైజ్ అవ్వడం వల్లనో, మరో అడ్డదారిలోనో ఈ పొజిషన్‌కు రాలేదని పాయల్ తేల్చి చెప్పింది.

ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దు పెట్టుకోవడానికి రాలేదు
‘ఆర్‌ఎక్స్ 100' తరహాలో ఇకపై హాట్ సీన్లు చేయాల్సి వస్తే చేస్తారా? అనే ప్రశ్నకు పాయల్ స్పందిస్తూ.... , సినిమా కథకు అవెంత వరకు అవసరమో చెప్పి దర్శకుడు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడకి నేను నటించడానికి వచ్చాను. నేను పూర్తిగా ప్రొఫెషనల్. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దు పెట్టుకోవడానికి నేనిక్కడికి రాలేదని స్పష్టం చేశారు.

ఆలాంటి సీన్లు చేసినపుడు మా ఇంట్లో
మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. ఆర్ఎక్స్ 100 లాంటి సినిమా చేసే ముందు మా అమ్మానాన్నతో కూర్చొని చర్చించాను. పాత్ర నచ్చిందని, నా మీద నమ్మకం ఉంచమని చెప్పాను. నాన్న తొలుత కొంచెం డిస్ట్రబ్ అయినా... చివరికి అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ నాతో కలిసి సినిమా చూశారు. ఆమెకు ఏమీ అభ్యంతరం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్ చేసినందుకు గొప్పగా అనిపిస్తోందని తెలిపారు.


Click it and Unblock the Notifications











