Mangalavaaram ఈవెంట్‌లో షాకింగ్ సీన్: నన్ను అలా చూడొద్దు.. అల్లు అర్జున్ ముఖం మీదే చెప్పిన హీరోయిన్
తెలుగు చిత్ర పరిశ్రమలో RX100 మూవీతో దర్శకుడిగా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నాడు అజయ్ భూపతి. అంత పెద్ద హిట్ వచ్చినా రెండో సినిమా చేయడానికి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అలా గత ఏడాది 'మహాసముద్రం'తో వచ్చాడు. కానీ, ఇది నిరాశనే మిగిల్చింది. దీంతో ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న లక్ష్యంతో 'మంగళవారం' మూవీని చేశాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఇందులో పాయల్ రాజ్‌పుత్.. అల్లు అర్జున్‌తో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
మంగళవారం అంటూ రెడీగా : RX100 వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమానే 'మంగళవారం'. ఈ చిత్రాన్ని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు నటించారు.

గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ : మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న 'మంగళవారం' మూవీని నవంబర్ 17వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా వచ్చిన ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు.
తగ్గేదేలే అంటూ పాయల్ : ఎంతో గ్రాండ్‌గా జరిగిన 'మంగళవారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అదిరిపోయే స్పీచ్‌తో ఆకట్టుకుంది. కొంచెం తెలుగులో, కొంచెం హిందీలో, కొంచెం ఇంగ్లీష్‌లో ముద్దు ముద్దు మాటలతో మెప్పించింది. స్పీచ్ మొదలెట్టిన సమయంలోనే పాయల్ 'అందరికీ నమస్కారం.. హలో పుష్పరాజ్.. తగ్గేదేలే సాలా' అంటూ డైలాగ్ చెప్పింది.

నన్ను అలా చూడొద్దంటూ : ఆ తర్వాత పాయల్ రాజ్‌పుత్ మాట్లాడడానికి ఇబ్బంది పడింది. ఆ సమయంలోనే 'అర్జున్ సార్.. ప్లీజ్ నన్ను అలా చూడకండి. మిమ్మల్ని చూడగానే నేను బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏం మాట్లాడాలో నాకు అస్సలు తెలియడం లేదు. కానీ, నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను. మళ్లీ వాటిని గుర్తు చేసుకుంటున్నాను' అని పేర్కొంది.
ఎవరినీ కోరుకుంటున్నారో : ఇదే వేడుకలో పాయల్ 'మీరు ఎవరినైతే రావాలని కావాలని గట్టిగా కోరుకుంటున్నారో.. ఆ ప్రకృతే తనను మీ ముందు ఉంచుతుంది. ఈరోజు మీరు (అల్లు అర్జున్) మాతో ఉన్నారు. ఇది నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. అంతేకాదు, నా కెరీర్‌లో ఇదే పెద్ద విషయంల. మీరు మా ఫంక్షన్‌కు వచ్చినందుకు చాలా థ్యాంక్స్' అంటూ అల్లు అర్జున్‌కు వివరించింది.

చాలా భయంగా ఉందంటూ : తర్వాత పాయల్ 'స్టేజ్ మీదకు వచ్చినప్పటి నుంచి భయం వేస్తుంది. గూస్‌బమ్స్ వస్తున్నాయి. నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు అయింది. నాపై చాలా ప్రేమను చూపించారు. దానికి మీ అందరికీ థ్యాంక్స్. నేను నిజాయితీతో అన్ని క్యారెక్టర్లు చేశాను. కాబట్టి మీరే చెప్పండి నన్ను నెత్తిన పెట్టుకుంటారా? కిందకు తోసేస్తారా? మీరు ఈ సినిమాను థియేటర్లలో చూడండి' అని ముగించింది.


Click it and Unblock the Notifications











