RX 100 బోల్డ్.. నాది డేరింగ్ నిర్ణయం: పాయల్.. చచ్చినా ఫర్వాలేదు.. కోట్లు పోయాయి..

By Rajababu

Recommended Video

RX 100 Movie Heroine Payal Interview

భారీ అంచనాలతో రిలీజైన RX 100 చిత్రం తొలి ఆట నుంచి భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. తెలుగు, రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ చిత్రానికి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గురువారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో హీరో హీరోయిన్లు కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్, రావు రమేష్, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు పాల్గొన్నారు.

 అప్పుడు బలుపు అనుకొన్నారు

అప్పుడు బలుపు అనుకొన్నారు

థియేటర్లలో మా సినిమా చూసి కేరింతలు, ఈలలు కొడుతున్న ప్రేక్షకులను చూస్తే చాలా ఆనందం వేసింది. సినిమా నచ్చకపోతే ఇక్కడికే రండి.. టికెట్ డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పడం బలుపు అని అనుకొన్నారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే పార్టీ ఇచ్చే పరిస్థితి ఉంది. యాక్షన్లు సీన్లు చాలా కష్టపడి చేశాం. అలాంటి సన్నివేశాలకు చనిపోయినా ఫర్వాలేదనిపించింది అని హీరో కార్తీకేయ అన్నారు.

డేరింగ్, బోల్డ్ నిర్ణయమే

డేరింగ్, బోల్డ్ నిర్ణయమే

ఎవరైతే సాహసం చేస్తారో.. ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ముందుకు వస్తారో వారికే విజయం దక్కుతుందని అంటారు. ఆ రెండింటిని నేను చేసి సక్సెస్ సాధించాను. ఈ చిత్రంలో ఇందు పాత్ర చేయడం డేరింగ్, బోల్డ్ అని హీరోయిన్ ఇందు అన్నారు. కథ చెప్పినప్పడే రిలీజ్ తర్వాత ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ముందే ఊహించాను. ఈ సినిమా విజయం ఏ ఒక్కరిదో కాదు.. టీమ్ వర్క్ వల్లనే సాధ్యపడింది అని పాయల్ అన్నారు.

కోట్లు పోగొట్టుకొన్నానని అజయ్

కోట్లు పోగొట్టుకొన్నానని అజయ్

సక్సెస్ టాక్ విన్న తర్వాత పదేళ్ల క్రితం దర్శకుడిగా మారేందుకు హైదరాబాద్ వచ్చిన సంఘటన గుర్తొచ్చింది. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. అయినే ఎప్పుడు నిరుత్సాహపడలేదు. డైరెక్షన్ చేయాలన్న తపనతో కోట్లు పొగొట్టుకొన్నాను. RX 100 సక్సెస్‌తో అవన్నీ మరిచిపోయాను. ప్రతీ థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన బాగుంది. సినిమా రిలీజ్‌కు మేము చెప్పిన మాటలు విని బలుపు అనుకొన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత మా నమ్మకాని బలం చేకూరింది అని అజయ్ భూపతి అన్నారు.

ఎమర్జెన్సీ సక్సెస్ మీట్

ఎమర్జెన్సీ సక్సెస్ మీట్

సక్సెస్ హెవీగా రావడం వల్ల ఎమర్జెన్సీ సక్సెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. సినిమాకు కలెక్షన్లను, ప్రేక్షకులను తెప్పించిన ఘనత డైరెక్టర్ అజయ్ భూపతిదే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర గురించి చెప్పినప్పుడే మతిపోయింది. ఆ పాత్రను అంతే మొత్తంలో పాయల్ చేసి మెప్పించడం ఆనందంగా ఉంది. కార్తీకేయ సినిమాను తన భుజాల మీద మోసి సినిమాకు విజయం అందించాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం. క్లైమాక్స్‌లో ఆయన నటన చూసి ఏడుపు వచ్చింది అని రావు రమేష్ అన్నారు.

రావు రమేష్ భరోసా మరువలేం

రావు రమేష్ భరోసా మరువలేం

RX 100 సినిమా విజయంలో మీడియాది కీలకపాత్ర. ప్రేక్షకులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు రావు రమేష్ ఇచ్చిన భరోసా మరువలేనిది. సినిమా రిలీజ్ రోజున వర్షం రావడంతో భయమేసింది. కానీ గంట, గంటకు అందిన రిపోర్టులతో ఉపశమనం లభించింది. సాయంత్రానికి కల్లా బ్లాక్‌బస్టర్ రిపోర్టు వచ్చింది అని నిర్మాత అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

రూ.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

రూ.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

రిలీజ్ రోజున వర్షాలు పడ్డప్పటికీ ఈ చిత్రం రూ.2 కోట్లు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయడం రికార్డు అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో వసూలు చేయగా అన్నిచోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది అని నిర్మాత అశోక్ రెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X