పైలట్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్.. పాకిస్థాన్ సరిహద్దుల్లో

Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనతికాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది పాయల్ రాజ్‌పుత్. పాత్ర పరిధి ఎంతనేది చూడకుండా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ భామ.. ఇటీవలే వెంకీ మామ రూపంలో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ఓ సినిమాలో డిఫెరెంట్ రోల్ పోషిస్తోంది పాయల్. జయంత్‌.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''నరేంద్ర'' చిత్రంలో ఆమె పోషిస్తున్న రోల్ విలక్షణంగా ఉండనుందట.

ఈషాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్‌ ఫస్ట్‌ ఫిమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోంది. ఆమె పాత్ర శక్తివంతంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. పాకిస్థాన్‌ జైలులో బందీ అయిన ఓ భారతీయ బాక్సర్‌ కథనే ఈ ''నరేంద్ర'' మూవీ. శత్రుదేశం నుంచి తప్పించుకున్న ఆ బాక్సర్‌ ఎలా మాతృభూమికి చేరుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. చిత్రంలో ట్విస్టులు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తోంది.

Payal Rajput Special Role: Change as Fighter

ఈ డిఫెరెంట్ చిత్రంలో నీలేష్‌ హీరోగా హీరోగా నటిస్తుండగా.. పాయల్ రాజ్‌పుత్, ఇజాబెల్లె లియేటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మానవహక్కుల కార్యకర్తగా ఇజాబెల్లె కనిపించనుంది. రామ్‌ సంపత్‌ బాణీలు కడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపుకు చేరుకుంది. మిగిలిన పార్టీ కంప్లీట్ చేసి ఈ వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుంచుతామని అంటున్నారు దర్శకనిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X