బోల్డ్‌ సీన్లలో చాలా కష్టపడతా.. అమ్మకి చెబితే ఆ మాటే అంటుంది: పెళ్లిపై పాయల్ రియాక్షన్

Rx 100 సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే యువత మనసు దోచుకున్న ఆమె ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ అందరికీ దగ్గరైంది. మొన్నటికి మొన్న వెంకటేష్‌తో జోడీ కట్టి 'వెంకీమామ' రూపంలో సూపర్ హిట్ సాధించిన పాయల్.. ఇటీవలే 'డిస్కో రాజా' సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన పాయల్.. తన కెరీర్, పెళ్ళికి సంబంధించిన విషయాలు చెప్పింది. వివరాల్లోకి పోతే..

ఆమెతో ముందే చర్చిస్తా.. ఆ తర్వాతే!

ఆమెతో ముందే చర్చిస్తా.. ఆ తర్వాతే!

ముద్దు సీన్లు, బోల్డ్ సన్నివేశాలలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా నటించడమే కాకుండా అలాంటి వాటి గురించి ముందే తన తల్లితో స్వేచ్చగా చర్చిస్తానని చెబుతోంది పాల బుగ్గల పాప పాయల్. ఏదైనా తన తల్లితో పంచుకుంటానని ఆమె చెబుతోంది.

ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు

ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు

తన సినిమాలకు సంబంధించి ప్రతీ విషయాన్ని అమ్మతో పంచుకోవడం తనకు అలవాటని చెప్పింది పాయల్. తాను ఏదైనా స్క్రిప్టు వింటే అందులోని విషయాలన్నీ అమ్మతో పంచుకుంటానని చెప్పింది. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి.. ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఉంటాయని అమ్మతో ముందే చెబుతానని ఆమె తెలిపింది.

అమ్మానాన్నలతో కలిసి చూడటం కష్టమే..

అమ్మానాన్నలతో కలిసి చూడటం కష్టమే..

అయితే.. నీ మనసుకు నచ్చి నీకు సౌకర్యంగా అనిపిస్తే ఏదైనా చేయి అని అమ్మ సలహా ఇస్తుందని పాయల్ చెప్పుకొచ్చింది. అయితే బోల్డ్‌గా ఉండే పాత్రలు ఎంత ఇష్టపడి చేసినా కూడా అమ్మానాన్నలతో కలిసి చూడటం అసౌకర్యంగానే ఉంటుందని ఆమె అంటోంది. అలాగని అలాంటి పాత్రలు చేయొద్దని అమ్మానాన్నలు తనని కట్టడి చేయరని ఆమె చెబుతోంది.

పెళ్లి గురించి పాయల్..

పెళ్లి గురించి పాయల్..

ఈ మేరకు తన పెళ్లి గురించి స్పందించిన పాయల్.. తనను చేసుకోబోయే వాడు అందంగా ఉండాలని, అయితే అతని ఎత్తు విషయంలో షరతులు లేవని చెప్పింది. తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉండే వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. తాను ఖచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటానని, అయితే చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోనని చెప్పింది పాయల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X