అద్బుతం అంటున్న పి.సి శ్రీరామ్
హైదరాబాద్ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ ఎప్పుడు ఓ సినిమాను ఈ స్ధాయిలో మెచ్చుకోవటం చూడలేదు అంటున్నారు ఆయన అభిమానులు. ఆయన తాజాగా చేసిన ‘ఐ' సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ పొంగిపోతున్నారు. భారతీయ సినీ పతాకంపై అద్భుతమైన దృశ్యకావ్యంగా మిగులుతుంది అని పొగుడుతున్నారు. శంకర్ దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. పి.సి.శ్రీరామ్ ఫేస్‌బుక్‌లో ‘ఐ' సినిమా గురించి రాసుకున్నారు.
‘‘షమితాబ్ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ‘ఐ' ఆఖరి షెడ్యూల్ పూర్తయింది. ‘ఐ' చిత్రం అందమైన అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాతో తప్పకుండా నేను భారతీయ సినిమా చరిత్రలోకి ప్రవేశిస్తాను. దర్శకుడు శంకర్, విక్రమ్, బాస్కో, ముదిరాజ్, అమీ జాక్సన్, నా అసోసియేట్ వివేక్‌తో పాటు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘ఐ' సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. తప్పకుండా భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంటుంది. సినిమాను ఇంత గొప్పగా ఆవిష్కరించడానికి ఏకైక కారకుడు శంకర్. తనే ‘ఐ' చిత్రం సృజనకారుడు'' అని ఫేస్‌బుక్‌లో రాసుకున్నారు.

విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న సినిమా ‘ఐ'. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య పూర్తయింది.
దీపావళి పండుగకు రిలీజ్ అని చెప్పిన శంకర్ భారీ చిత్రం "ఐ" రాకపోవచ్చు అని తెలుస్తోంది. అనుకున్నట్లుగా 23 న విడుదల చేయటానికి ఫైనాన్స్ కారణాలు అడ్డుపడుతున్నాయని కోలీవుడ్ టాక్. దాంతో ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్న ప్యాన్స్ నిరాశపడుతున్నారు. అయితే ఈ విషయమై అంతర్గత వర్గాల సమాచారమే కానీ అఫిషియల్ ఎనౌన్సమెంట్ మాత్రం లేదు.
ఇక రెండు రోజుల క్రితం ఐ చిత్ర గ్రాఫిక్, నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొంది చిత్ర యూనిట్. ప్రస్తుతం రిలీజ్ తర్వత వేసే ప్రమోలు, రిలీజ్ కు ముందు చేయాల్సిన ప్రమోషన్ పై దృష్టి పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications











