Peddi: రాంచరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చిరంజీవి మార్క్ సెటిల్మెంట్.. పెద్దికి లైన్ క్లియర్
తెలంగాణలో పెద్ది రిలీజ్‌ను అనిశ్చితిలోకి నెట్టిన పర్సెంటేజీ వివాదానికి చిరంజీవి తనదైన శైలిలో ముగింపు పలికారు. గత రెండు, మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ వివాదంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు మధ్య భారీ అగాథం ఏర్పడిందా? అనే అనుమానం కలిగింది. అయితే ఓ దశలో పర్సంటేజ్ విధానం కొనసాగిస్తే తప్పా.. పెద్దిని నైజాంలో రిలీజ్ చేయమని హెచ్చరించారు.
అయితే ఎగ్జిబిటర్లు హెచ్చరికలకు అదే రీతిలో నిర్మాతలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయగా వారి మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకొన్నాయి. దాంతో ఈ వివాదం పెద్ద సంక్షోభమే సృష్టిస్తుందా? అనే విధంగా అనుమానాలు, సందేహాలను క్రియేట్ చేసింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదం బంతి చిరంజీవి కోర్టులోకి వెళ్లింది. అయితే క్లిషమైన ఈ సమస్యను మెగాస్టార్ సున్నితంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. నిర్మాతలను, ఎగ్జిబిటర్ల మధ్య సయోధ్యను కుదర్చడంలో సఫలమయ్యారు. ఈ వివాదానికి ముగింపు పలికిన విధం ఎలా జరిగిందంటే?

తెలంగాణలో సింగిల్ థియేటర్లలో ఇప్పటి వరకు కొనసాగుతున్న రెంటల్ విధానానికి స్వస్తి చెప్పి.. పర్సంటేజ్ విధానంలో సినిమా ప్రదర్శన కోసం పరిహారం చెల్లించాలనే డిమాండ్ ఎగ్జిబిటర్ల నుంచి వచ్చింది. ఏషియన్ సునీల్, శిరీష్ రెడ్డి, శ్రీధర్ తదితర తెలంగాణ ఎగ్జిబిటర్ల నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంగా తమ డిమాండ్‌ను పట్టించుకోలేదు. హరిహర వీరమల్లు సమయంలో ఇచ్చిన హామీని పక్కదారి పట్టించారు. అందుకే పెద్ది సినిమా రిలీజ్ నేపథ్యంలో తమ డిమాండ్‌ను తెరపైకి తెచ్చామని తెలిపారు.
అయితే ఎగ్జిబిటర్ల డిమాండ్లపై నిర్మాతలు ఘాటుగా స్పందించారు. సింగిల్ థియేటర్లలో కనీస సదుపాయలు లేకుండా వాటిని నాశనం చేసేది ఎగ్జిబిటర్లే. థియేటర్ల మెరుగుదల విషయంలో గ్రేడింగ్ ఉండాలి అని డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్‌లను నడిపే వారే సింగిల్ థియేటర్లలో నాణ్యత ప్రమాణాలను పెంచడం లేదని విమర్శలు చేయడంపై ఎగ్జిబిటర్లు మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చిరంజీవి సమావేశమయ్యారు.
చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ వివాదం పుల్‌స్టాప్ పడింది. పెద్ది చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు తాత్కాలిక నిర్ణయం తీసుకొన్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంట్‌తోపాటుగా 7.5% ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుంది. చిరంజీవి ఇచ్చిన హామీ మేరకు పెద్ది సినిమా రిలీజ్‌కు తాము సహరిస్తాం. పర్సంటే్ విధానం గురించి జూన్ 30వ తేదీన నిర్ణయం తీసుకొంటారు. ఆ నిర్ణయం ప్రకారం జూలై 3వ తేదీ నుంచి అమలు చేస్తామని ఛాంబర్ చెప్పిన విషయాన్ని ఎగ్జిబిటర్లకు చిరంజీవి స్పష్టం చేశారు. దాంతో ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను పక్కన పెట్టి పెద్ది రిలీజ్‌కు సహకరిస్తామని చెప్పినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications