Peka Medalu నమ్మినవారే మోసం చేశారు.. సుకుమార్, కొరటాల శివ లేకపోతే.. యువ హీరో ఆవేదన
ఎవరికీ చెప్పొద్దు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన రాకేశ్ వర్రే ప్రస్తుతం నిర్మాతగా మారారు. క్రేజీ యాంట్స్ పతాకంపై తాజాగా నీలగిరి మామిలల్ దర్శకత్వంలో పేక మేడలు సినిమాను నిరమిస్తున్నారు. ఇటీవల విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన వీడియో 1.5 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాత రాకేశ్ వర్రే చేసిన స్పీచ్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. రాకేశ్ వర్రే స్పీచ్ వివరాల్లోకి వెళితే..
ఎవరికీ చెప్పొద్దు సినిమా తర్వాత మూడేళ్లకు పేకమేడలు సినిమాను నిర్మాతగా మారి రూపొందించాను. ఆ సినిమా రిలీజ్ సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను ఎవరైతే నా పక్కన ఉండి సహాయం చేస్తారని అనుకొన్నానో వారు నా వెనుక నిలబడలేదు. వారు నా నుంచి దూరంగా తప్పుకోవడం షాక్ తిన్నాను. ఆ సమయంలో శశికిరణ్ తిక్కా, రాహుల్ సంకృత్యన్, తరుణ్ భాస్కర్, సుకుమార్, కొరటాల శివ లాంటి దర్శకులు నాకు సహాయం చేయడంతో ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాను రిలీజ్ చేశాను అని రాకేవ్ వర్రే తెలిపారు.

ఎవరికీ చెప్పొద్దు సినిమా 3 రోజుల్లో తీసేస్తారని అనుకొన్న సమయంలో ప్రేక్షకుల సపోర్టుతో 30 రోజుల ఆడింది. ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సినిమాల్లో పాపులర్‌గా నిలిచింది. ఆ సినిమా అందించిన ఉత్సాహంతో పేక మేడలు సినిమాను నిర్మించాను అని రాకేశ్ వర్రే తెలిపారు.
నా స్నేహితుడి ద్వారా దర్శకుడు చెప్పిన కథ విన్న వెంటనే నచ్చింది. నేను హీరోగా కాకుండా నిర్మాతగా సినిమాను మొదలుపెట్టాను. హైదరాబాద్‌లో పాత బస్తీలో ఉన్న ఓ యువకుడి కథ. ఈ సినిమాకు పక్కాగా వర్క్ చేశాం. మంచి ప్రమాణాలతో సినిమాను తెరకెక్కిస్తున్నాం. సినిమా పరిశ్రమలో కమిట్‌మెంట్ ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. అందుకే ఆయన చేతుల మీదుగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాను అని రాకేశ్ వర్రె చెప్పారు.
రాకేశ్ వర్రే కెరీర్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రంలో సేతుపతి క్యారెక్టర్ ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎవరికీ చెప్పొద్దు అనే చిత్రంలో హీరోగా నటించారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తొలి సినిమా దర్శకుడు యాకూబ్ ఆలీ దర్శకత్వలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











