పెళ్లయిన కొత్తలో.. విదేశాలలో..
ఆ నలుగురు ఫిలింస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో మదన్ నిర్మిస్తున్న పెళ్లయిన కొత్తలో.. చిత్రం షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. జగపతిబాబు, ప్రియమణి, ఆస్తా సింఘాల్ ప్రధాన తారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి చివరి రెండు పాటలను థాయిలెండ్‌లోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించనున్నారు.
జగపతిబాబు, ప్రియమణి ఈ షూటింగ్‌లో పాల్గొంటారని, నవంబర్ 6 నుంచి ఈ పాటల చిత్రీకరణ జరుగుతుందని దర్శకుడు మదన్ తెలిపారు. ఈ చిత్రం గురించి మదన్ మాట్లాడుతూ - ఆ నలుగురు చిత్రం ద్వారా రచయితగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ ఉత్సాహంతో నలుగురు మిత్రులం కలిసి ఆర్టిస్టులు, ముఖ్యంగా జగపతిబాబు సహకారంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
ఈ సినిమా నేటి సమాజంలో మానవ సంబంధాల పోకడలను సున్నితంగా ఆవిష్కరించి, వాటిని కొత్తగా పెళ్లయిన జంట ఎలా అధిగమించిందీ వివరించాం. ఇది పూర్తిగా వినోదంతో సాగి అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుంది. సంగీత దర్శకుడు అగస్త్య చాలా మెలోడీతో బాణీలు సమకూర్చారు. నవంబర్ రెండో వారంలో ఆడియోని విడుదల చేస్తున్నాం అన్నారు మదన్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్ టి జగన్, బి మహేంద్రబాబు ఈ చిత్రం ప్రోగ్రస్ గురించి వివరిస్తూ ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందిస్తున్నాం. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అయి మా యూనిట్‌కి మంచి పేరు తెస్తుంది, మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి ప్రేరణ, ప్రోత్సాహం కూడా ఇస్తుంది.. అన్నారు.
వేటూరి, చైతన్యప్రసాద్, ఉమామహేశ్వర్ పాటలు రాశారు. కెమెరా సురేంద్రరెడ్డి.


Click it and Unblock the Notifications