'ఈ నగరానికి ఏమైంది'పై నెగిటివ్ ప్రచారం.. వాళ్లపై తరుణ్ భాస్కర్ సంచలనం వ్యాఖ్యలు!

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మాణంలో ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి చూపులు చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టి అందరి దృష్టిని తరుణ్ భాస్కర్ తన వైపుకు తిప్పుతున్నాడు. అతడి దర్శకత్వంలో ఈ చిత్రం కూడా రూపొందడంతో అంచనాలు పెరిగాయి. కానీ ఈ నగరానికి ఏమైంది చిత్రానికి కొన్ని వర్గాల ప్రేక్షుకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్, మరి కొంతమంది నుంచి డివైడ్ టాక్ వచ్చింది. ఫిలిం క్రిటిక్స్ కూడా ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలని వ్యక్తం చేశారు. ఈ అంశం గురించి మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Recommended Video

Ee Nagaraniki Emaindi Celebrity Response
 కొత్తవారితో

కొత్తవారితో

తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని కొత్త హీరోలతో తెరకెక్కించాడు. ఫ్రెండ్ షిప్, కామెడీ అంశాలతో తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విరివిగా చేసిన ప్రమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెరిగేలా చేశాయి.

అంచనాలకు తగ్గట్లుగా

అంచనాలకు తగ్గట్లుగా

పెళ్లి చూపులు చిత్రంతో తాను అందరిదారిలో కమర్షియల్ చిత్రాలు తీసే దర్శకుడిని కాదని తరుణ్ చెప్పకనే చెప్పాడు. అదే క్రమంలో యువతని టార్గెట్ చేసేలా తరుణ్ చిత్రాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగాఈ నగరానికి ఏమైంది చిత్రం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

విరుచుకుపడ్డ తరుణ్ భాస్కర్

విరుచుకుపడ్డ తరుణ్ భాస్కర్

ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదంటూ రివ్యూలు ఇస్తున్న ఫిలిం క్రిటిక్స్ పై తరుణ్ మండి పడ్డాడు. ఏదో ఒక రోజు తాను రివ్యూలు రాసే వారిపై రివ్యూలు రాస్తానని తరుణ్ భాస్కర్ అన్నారు. ఏ మాత్రం సినిమా జ్ఞానం లేకుండా రివ్యూలు ఇస్తున్నారని తరుణ్ మండిపడ్డాడు.

 అంతా జీరో

అంతా జీరో

రివ్యూలు ఇస్తున్న వారికీ స్క్రీన్ ప్లే, ఫిలిం మేకింగ్ గురించి ఇతర పరిజ్ఞానం జీరో అని వ్యాఖ్యానించారు. అలాంటి వారు కూడా రివ్యూలు ఇస్తున్నట్లు తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X