కొత్తది మొదలు పెట్టాడు: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా అప్ డేట్

తరుణ్ భాస్కర్ తన నెక్స్ట్ సినిమాను సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఈ రోజు మొదలు పెట్టనున్నాడు. పూర్తిగా కొత్త వారితో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ సినిమాగా పెళ్లి చూపులు సినిమా నిలిచింది, ఎటువంటి కమర్షియల్ హంగులు, రొటీన్ స్టోరీ లేకుండా వచ్చి కలెక్షన్ల దుమ్ము దులిపిన చిత్రం పెళ్లిచూపులు. 2016 లో విజయ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఎంతటి ఘాన విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే.

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.సినిమాలపై ఉన్న ఇష్టంతో మొదట తన జర్నీని షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి 'సైన్మా' అనే షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోని కొందరు పెద్దల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి 'తరుణ్ భాస్కర్'. గ్లోబల్ సినిమా తరహాలో మన చుట్టూ నిత్యం జరిగే కథలనే సినిమాగా తెరకెక్కించాలని 'పెళ్లి చూపులు' అనే ఓ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు.

Pelli Choopulu Tarun Bhascker Starts his Second Movie

అయితే చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్‌కి పెళ్లి చూపులు సినిమా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. కానీ తన రెండవ సినిమాను సెట్స్ పైకి తేవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఫైనల్ గా తరుణ్ భాస్కర్ తన నెక్స్ట్ సినిమాను సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఈ రోజు మొదలు పెట్టనున్నాడు. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా స్టార్ట్ అవ్వనున్నట్లు టాక్. పూర్తిగా కొత్త వారితో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

నిర్మాత సురేష్ బాబు పెళ్లి చూపులు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి లాభాలను అందించడంతో తరుణ్ భాస్కర్ కి అవకాశం ఇచ్చారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ఈరోజు స్టార్ట్ చేసి 45 రోజుల్లో షూటింగ్ ని ఫినిష్ చేసేందుకు తరుణ్ భాస్కర్ బాగానే ప్రయత్నిస్తున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X