మళ్ళీ నటుడిగా బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ డైరెక్టర్.. మరో ప్రయోగం రెడీ!

న్యూ యంగ్ టాలెంటెడ్ దర్శకులు ఈ మధ్య సెలెక్ట్ చేసుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అవుతున్నప్పటికి వారు చేస్తున్న ప్రయోగాలకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక దర్శకులు అవసరమైన సమయంలో నటులుగా కూడా రానిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు.

విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు సినిమా చేసిన తరుణ్ భాస్కర్ ఆ ఒక్క సినిమాతోనే మంచి దర్శకుడిగా క్రేజ్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా యువతను బాగా ఎట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో సీక్వెల్ ను కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో టాక్ బాగానే వచ్చింది. ఇక ఈ దర్శకుడు అప్పుడప్పుడు నటుడిగా కూడా తన శిష్యుల సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.

pelli chupulu director Tharun Bhascker Dhaassyam busy in acting

ఇదివరకే విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌజ్ లో మీకు మాత్రమే చెప్తా! అనే సినిమాను చేసిన తరుణ్ నెక్స్ట్ వెబ్ సిరీస్ తో రాబోతున్నాడట. సిద్దార్థ్ గౌతమ్ దర్శకత్వంలో 'రూమ్ నెంబర్ 54' అనే టైటిల్ తో రూపొందుతున్న ఆ వెబ్ సిరీస్ జీ 5లో మే 21న విడుదల కానుంది. కాలేజ్ డేస్ లోని బ్యాచిలర్ లైఫ్ ఆధారంగా ఈ సిరిస్ ను రూపొందించారట. ఇక త్వరలోనే ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక దర్శకుడిగా తరుణ్ భాస్కర్ నాగ చైతన్యతో ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X