50 ఏళ్ల పెళ్లి సందడి హీరోయిన్.. అందాల హొయలకు ఫిదా కావాల్సిందే!
టాలీవడ్ లో హీరోయిన్లని అందంగా చూపించడంలో రాఘవేంద్ర రావుని మించిన వాళ్ళు లేరు. రాఘవేంద్ర రావు చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఓవెలుగు వెలగడం ఖాయం. అందాల తార దీప్తి భట్నాకర్ విషయంలో కూడా అదే జరిగింది. రాఘవేంద్ర రావు దర్శత్వంలో సూపర్ హిట్ చిత్రం పెళ్లి సందడి చిత్రంలో తెలుగు యువతకు దీప్తి స్వప్న సుందరిగా పరిచయం అయింది. నిజంగానే యువత హృదయాల్లో స్వప్న సుందరిగానే మారిపోయింది.

వయసు వెనక్కి నెడుతూ
అనుకోకుండా దీప్తిని ఎవరైనా చూస్తే ఆమెకు 50 ఏళ్ల వయసు అని అస్సలు ఊహించలేరు. ఇంస్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేస్తున్న గ్లామరస్ ఫొటోలే ఇందుకు నిదర్శనం. ఈ ఫోటోలలో దీప్తినిచూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం 30 ఏళ్లకే హీరోయిన్ల వయసు మీద పడ్డట్లు తెలిసిపోతోంది. కానీ ఈ వయసులో కూడా చెక్కు చెదరని సౌందర్యంతో ఉండడం దీప్తికే చెల్లిందని చెప్పొచ్చు.

వివాహ జీవితం
పెళ్లి సందడి చిత్రం తరువాత దీప్తి భట్నాకర్ తెలుగులో మంచి అవకాశాలు అందుకుంది. కానీ 2004 లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆమె సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది.

సోషల్ మీడియాలో
సినిమాలకు దూరమైనది కానీ అభిమానులకు కాదు. సోషల్ మీడియాలో తన ప్రతి వెకేషన్ కి సంబందించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలే ప్రస్తుతం నెటిజన్లలో హాట్ టాపిక్ గా మారాయి. 50 ఏళ్ల వయసులో కూడా మోడరన్ దుస్తుల్లో అదరగొడుతోంది. ఆమె అందానికి అంతా ఫిదా అవుతున్నారు. బికినిలో మెరిసిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దర్శకుల కంటపడితే
దీప్తి ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల కంట పడితే తమ చిత్రాలలో కీలక పాత్రలలో ఆమెకు అవకాశాలు ఇవ్వడం ఖాయం. రమ్యకృష్ణ, స్నేహ వంటి సీనియర్ హీరోయిన్లు అద్భుతమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











