అరవింద సమేత: పెనివిటి సాంగుకు సూపర్ రెస్పాన్స్, తమన్ తల్లి కంటతడి!
Recommended Video

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' చిత్రానికి సంబంధించి 'పెనివిటి' సాంగుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోపే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేయగా..... కాల భైరవ పాడారు. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చెప్పినట్టుగా ఈ పాట పదికాలాలపాటు గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ పాట విని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మదర్ కూడా ఎమోషనల్ అయ్యారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. అమ్మ నన్ను సడెన్‌గా తన రూముకు రమ్మని పిలిచి హగ్ చేసుకున్నారు. ఆమె ముఖంలో ఆనంద భాష్పాలతో నా షర్టు తడిచిపోయింది. ఈ పాట విన్న తర్వాత ఆమె చాలా ఆనంద పడ్డారు.... అని తమన్ తెలిపారు.

'అరవింద్ సమేత' చిత్రానని హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











