»   » అభిమానం అంటే అది: కోట్లు ఇస్తానన్నా డోంట్ కేర్ అంటున్న ఫ్యాన్!

అభిమానం అంటే అది: కోట్లు ఇస్తానన్నా డోంట్ కేర్ అంటున్న ఫ్యాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్ కతా: అది 20 ఏళ్ల నాటి పాత డొక్కు స్కూటర్. అమ్మితే ఐదు పది వేల రూపాయలు రావడం కూడా ఎక్కువే. అలాంటి స్కూటర్ ఇపుడు లక్షలు ఇచ్చి కొనడానికి పోటీ పడుతున్నారు కొందరు. అయితే ఓనర్ మాత్రం అమ్మడానికి ఇష్టపడటం లేదు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి ఆఫర్ వస్తే కల్లు మూసుకుని ఒప్పకుంటారు. కానీ ఆ ఓనర్ కు డబ్బు కంటే ఆ స్కూటరే ఎక్కువైంది. కారణం అది తన అభిమాన హీరో నడిపిన స్కూటర్ కావడమే.

లక్షలు కాదు కదా...ఎన్ని కోట్లిచ్చినా ఆ స్కూటర్ అమ్మే ప్రసక్తే లేదంటున్నాడు. ఆ స్కూటర్ ఇపుడు కోల్ కతాలో ఉంది. స్కూటర్ ఓనర్ పేరు సుజిత్ నారాయణ్. అతను సుర్ కోల్కతాలో సెకండ్ హ్యాండ్ వాహనాలను అమ్మతుంటాడు.

ఇటీవల అమితాబ్ బచ్చన్ నటించిన 'టె3న్' అనే సినిమాలో ఈ స్కూటర్ ఉపయోగించారు. సినిమా కోసం అమితాబ్ డ్రైవ్ చేసేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసి ఇచ్చాడు సుజిత్. ఈ సినిమాలో మొత్తం బిగ్ బి ఇదే స్కూటర్ మీద తిరుగుతుంటారు.

షూటింగ్ పూర్తయిపోయాక.. ఈ స్కూటర్ మళ్లీ సుజిత్ దగ్గరకు చేరిపోయింది. బాలీవుడ్ ఈ మెగా స్టార్ అమితాబ్ నడిపిన స్కూటర్ కావడంతో దీన్ని దక్కించుకోవడానికి పలువురు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. అయితే తన దగ్గరకు వచ్చిన వారికి.... అమితాబ్ కు నేను మీకంటే పెద్ద అభిమానిని, అందుకే ఆయన నడిపిన దీనికి నేను వెల కట్టలేను అని తేల్చి చెప్పేస్తున్నాడు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

టె3న్

టె3న్

టె3న్ చిత్రంలో అమితాబ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విద్యా బాలన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇదొక థ్రిల్లర్ ఫిల్మ్.

దర్శకత్వం

దర్శకత్వం

రిబు దాస్ గుస్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

కిడ్నాప్

కిడ్నాప్

కిడ్నాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాన్ని చేధించే క్రమంలో అమితాబ్ ఏం చేసాడనేది ఆసక్తికరంగా సాగుతుంది. విద్యా బాలన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.

రిలీజ్

రిలీజ్

జూన్ 10న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
People Are Ready To Pay Lakhs For Amitabh Bachchan's Antique Scooter From TE3N movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu