twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' సెట్స్ చూసిన ఆ ఊళ్లో జనం ఇలా అంటున్నారు (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి సృష్టించిన సామ్రాజ్యం 'మాహిష్మతి'.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 'బాహుబలి' విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దిన రాజమౌళి.. ఇప్పుడు 'బాహుబలి' సామ్రాజ్యం మాహిష్మతిని నేరుగా సందర్శించే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నాడు.

    ఇందుకు సంబంధించిన బాహుబలి సెట్స్‌ వర్చువల్‌ రియాల్టీ (వీఆర్‌) వీడియోను ఆయన మన ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియోలో రాజమౌళితోపాటు ప్రభాస్‌, రానా, అనుష్క, కట్టప్ప బాహుబలి సెట్స్‌ గురించి వివరిస్తూ హల్‌చల్‌ చేశారు.

    మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూసి సినీ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. అద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సినిమాను తెరకెక్కించడంలో రాజమౌళిది ప్రత్యేక శైలి అని మెచ్చుకుంటున్నారు.

    'బాహుబలి' తెలుగు సినీ చరిత్రలో అద్భుత విజువల్‌ వండర్‌గా నిలిచిపోయింది. ఆయన సృష్టించిన 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని వర్చువల్‌ రియాల్టీ(వీఆర్‌) ద్వారా చూసిన పలువురు సినీ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు.

    ఇటీవల 'ఆన్‌ సెట్స్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో 360 డిగ్రీల కోణంలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూసే వెసులుబాటును కల్పించారు. వీఆర్‌ హెడ్‌సెట్‌ పెట్టుకుని పలువురు గ్రామస్థులు ఆ వీడియోను చూస్తూ అంతులేని ఆనందానికి గురవుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి ఆన్‌లైన్‌లో ఉంచాడు.

    అతని ప్రయత్నాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి, నటుడు రానా అభినందించడంతో పాటు సదరు వీడియోను తమ ట్విట్టర్‌ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

    వీఆర్‌ బాక్స్‌తో ఈ వీడియోను చూస్తే అచ్చం మాహిష్మతి సామ్రాజ్యంలో ఉండి..
    దానిని ఆస్వాదిస్తున్న భావన కలుగుతుంది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌, అత్యంత వేగమైన ఇంటర్నెట్‌, వీఆర్‌ బాక్స్‌ ఉంటే చాలు.. 360 డిగ్రీల కోణంలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని స్వయంగా సందర్శించవచ్చునని రాజమౌళి వివరించారు.

    వీఆర్‌ బాక్స్‌ లేకున్నా ఈ వీడియోను చూడొచ్చు కానీ, ఆ థ్రిల్‌ ఉండదని ఆయన వివరించారు. 'ఆన్‌ ద సెట్స్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో వర్చువల్‌ రియాల్టీ వీడియోను బాహుబలి యూనిట్‌ విడుదల చేసింది.

    English summary
    This fun react video of baahubali 2 set made with village friends. This is their first time VR experience too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X