రూమర్స్‌ను ఖండించిన నిశ్శబ్దం టీమ్.. ఏదైనా ఉంటే అధికారికంగా చెప్తాం!
ఓ వైపు కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో.. మరోవైపు రూమర్స్, ఫేక్ న్యూస్ అంతకంతకూ పెరిగిపోతో ఉన్నాయి. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందినవాటిలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియక సతమతవుతున్నారు. స్వయంగా హీరోలో, దర్శకనిర్మాతలే దిగి వచ్చి రూమర్స్‌ను ఖండించాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా నిశ్శబ్దం మూవీ యూనిట్ కూడా ఇదే పని చేసింది.
గత కొన్ని రోజులుగా సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయబోతోన్నట్టు వార్తలు వస్తున్నాయి. రామ్ RED కూడా అలాగే రాబోతోందని వార్తలు వస్తే.. స్వయంగా హీరో రంగంలోకి దిగి ఖండించాడు. ఇదే విషయమై నిశ్శబ్దం యూనిట్‌కు అనుష్క మధ్య దూరం పెరిగిందని, సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించింది.

తమ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న కథనాలు నమ్మవద్దని తెలిపింది. వాటిలో ఏ మాత్రం నిజం లేదని, షూటింగ్ మొదలైన రోజు నుంచి నటీనటులు, టెక్నీషియన్లు మాకు ఎంతో సహకరిస్తూ తోడుగా నిలుస్తున్నారని, మరీ ముఖ్యంగా అనుష్క మాకు అండగా నిలవడం ఎంతో గొప్ప విషయమని పీపుల్స్ మీడియా ఫాక్టరీ ఓ ప్రకటన చేసింది. అలానే సినిమాకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వాటిని రాబోయే రోజుల్లో తామే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











