»   » దుప్పట్లు, టవల్స్ అర్జంటుగా కావాలి: శృతి హాసన్

దుప్పట్లు, టవల్స్ అర్జంటుగా కావాలి: శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చెన్నై వరద బాధితులకు ఇతర ప్రాంతాల్లోని ప్రముఖులు, ప్రజలు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఆహార పదార్థాలు, త్రాగునీరు, మందులు, మరికొందరు డబ్బులు అందించే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ ప్రజలకు ప్రస్తుతం తక్షణ అవసరంగా దుప్పట్లు, టవల్స్, పారిశుద్యానికి సంబంధించిన వస్తువులు కావాలి, దయచేసి సహాయం చేయండి అని శృతి హాసన్ కోరుతోంది. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న వారిని శృతి హాసన్ అభినందించింది.


తమిళ సినీ స్టార్లతో పాటు తులుగు సినీ స్టాలు తమిళనాడు వరద బాధితులకు సహాయం చేసే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. చెన్నై వీధుల్లో తిరుగుతూ ఆహారం, మంచినీరు పంపినీ చేస్తున్నారు. మరికొందరు స్టార్లు తాము సహాయం చేయడంతో పాటు, ప్రజలను సహాయం దిశగా ప్రొత్సహిస్తున్నారు.
People need blankets and towels: Shruti Haasan

ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు విరాళంగా ఇవ్వడం కంటే... వారికి కావాల్సిన ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ అందించడం ఎంతో అవసరం. నిల్వ ఉండే ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ లాంటివి అందించే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఇతర వస్తువులు ఏమైనా పంపాలనుకుంటే రామానాయుడు స్టూడియో, ఫిల్మ్ నగర్, జూబ్లిహిల్స్, హైదరాబాద్ అడ్రస్ కు పంపండి. తప్పకుండా వీటిని నేరుగా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండే బాధితులకు మేము అందజేస్తాం' అని రాజమౌళి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్వయంగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. 'మన మద్రాస్ కోసం' అంటూ పలువురు స్టార్లు స్వయంగా విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం జరిగిన ఈకార్యక్రమానికి స్టార్లను చూసేందుకు భారీగా జనం తరలి రావడంతో గంధరగోళం నెలకొంది.

English summary
"Need of the hour- people need blankets and towels and basic hygiene amenities - please help" shruti haasan tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu