సినిమా ఫ్లాప్ అయినా నన్ను గుర్తిస్తున్నారు: తాప్సీ
నేను నమ్మలేకపోతున్నాను..డిల్లీ ఎయిర్ పోర్ట్ లో జనం నన్ను గుర్తు పట్టారు...అంటూ మురిసిపోతూ తాజాగా ట్వీట్ చేసిన తాప్సీ. ఆ విషయం చెప్తూ..ఝుమ్మది నాదం చిత్రం చాలా మందిని చేరిందనటానకి ఇదే నిదర్శనమని చెప్తోంది. ఇక రాఘవేంద్రరావు తాజా చిత్రం ఝుమ్మంది నాదం తో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ ఆదివారం(నిన్న) పుట్టిన రోజు జరుపుకోవటానికి తన సొంత సిటీ డిల్లీకి ప్రయాణమైంది. ఆ వేడుకలు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసి వస్తున్న ఆమెను డిల్లీ ఎయిర్ పోర్ట్ లో గుర్తు పట్టడం హ్యాపీ గా ఫీలవుతోంది. ఇక ఝుమ్మందినాదం చిత్రం పెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా ఆమెకి మాత్రం ఆఫర్స్ బాగానే తెచ్చిపెట్టింది. తాప్సీ ప్రస్తుతం విష్ణు సరసన ఒక సినిమా, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ధనుష్ సరసన తాప్సీ నటించిన 'ఆడుకలమ్' చిత్రం త్వరలో విడుదల కానుంది. కోలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











