‘పెప్పర్ స్ప్రే’ పేరుతో సినిమా! ఎవరిపై?

ఆ సంగతి పక్కన పెడితే ఇపుడు ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ అయిన మరో టైటిల్ ఇపుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'పెప్పర్ స్ర్పే' పేరుతో ఓ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇటీవల పార్లమెంటులో సభ జరుగుతుండగా ఎంపీ లగడపాటి పెప్పర్ స్ర్పే ప్రయోగించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అప్పటి వరకు పెద్దగా ప్రచారంలో లేని 'పెప్పర్ స్ప్రే' హాట్ టాపిక్ అయింది. ఇపుడు అదే పేరుతో సినిమా టైటిల్ కూడా రిజిస్టర్ కావడం గమనార్హం. ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించనున్నారా? లేక అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా టైటిల్ పెట్టారా? అనేది ఆ సినిమా వస్తేగానీ తెలీదు!
మరో వైపు 'బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్' పేరుతో కూడా ఓ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించారు. దీంతో పాటు గబ్బర్ సింగ్-2 టైటిల్ మాదరిగా గతంలో తెలుగులో హిట్టయిన పలు సినిమాకు సీక్వెల్ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. మరి ఇందులో ఎన్ని సినిమాలు పట్టాలెక్కుతాయో? ఎన్ని థియేటర్ల వరకు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications