మూడింటిలో ‘ఫర్ ఫెక్ట్’ ఆల్బం ఇదేనట..!
ఇటీవల తెలుగులో మూడు పెద్ద సినిమాల ఆల్బమ్స్ విడుదలయ్యాయి. యన్టీఆర్ 'శక్తి", ప్రభాస్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్", పవన్ కళ్యాణ్ 'తీన్ మార్"…ఈ మూడు సినిమాల ఆడియోనీ గ్రాండ్ గా జరిగిన ఫంక్షన్లలో విడుదల చేశారు. వీటిలో 'మిస్టర్ పెర్ ఫెక్ట్" కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వగా, మిగతా రెండింటికీ మణిశర్మ మ్యూజిక్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయా మ్యూజిక్ చార్ట్స్ లో 'మిస్టర్ పెర్ ఫెక్ట్" నెంబర్ వన్ ఆడియోగా నిలుస్తోంది. తర్వాత స్థానాల్లో వరుసగా 'శక్తి", 'తీన్ మార్" నిలుస్తున్నాయి.
మెలోడీ ప్లస్ మాస్ ని ఆకట్టుకునే విధంగా 'మిస్టర్ పెర్ ఫెక్ట్" సినిమాకి మంచి ట్యూన్స్ ఇచ్చి, డియస్ పి మరోసారి తన సత్తా చాటాడని అంటున్నారు. మామూలుగా ఏ సినిమాకైనా ఆడియో అనేది సగం సక్సెస్ గా పరిగణిస్తారు. అయితే, మ్యూజిక్ ఒక్కటే సినిమాను నిలబెడుతుందనీ చెప్పలేం. మ్యూజిక్ హిట్ అయి ఫ్లాప్ అయిన సినిమాలూ వున్నాయి, మ్యూజిక్ ఫ్లాప్ అయినా హిట్టయిన సినిమాలూ వున్నాయి.!సో ఈ మూడింటి ఫీడ్ బ్యాక్ ఎలావుంటుందో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











