హాట్ టాపిక్: 'మంచు లక్ష్మి' ఫెరఫ్యూమ్స్
హైదరాబాద్: మంచు లక్ష్మి ప్రసన్న పేరు మీద త్వరలో మార్కెట్లో ఫెరఫ్యూమ్స్, డియోడరెంట్స్ దొరకనున్నాయి. తన సొంత పేరు మీద ఓ బ్రాండ్ స్ధాపించి ఆమె ఇలా ఫెరఫ్యూమ్స్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ లలో ఇలా నటీనటులు తమ పేరు మీద ఈ తరహా వ్యాపారంలోకి దిగటం కొత్తేమి కాదు. అయితే తెలుగుకి మాత్రం ఇది కొత్త విషయమే. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం.
ప్రస్తుతం మంచు లక్ష్మి తాను నటిస్తూ 'గుండెల్లో గోదారి' నిర్మించింది. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
చిత్రంలో లక్ష్మి మంచుకి జంటగా చేసిన సుదీప్ కిషన్ మాట్లాడుతూ..
''ఒక నటుడిగా నాకు 'ప్రస్థానం' ఎంతగా పేరు తెచ్చిపెట్టిందో... 'గుండెల్లో గోదారి' కూడా ఆ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందనే నమ్మకముంది. ఒక పల్లెటూరి యువకుడిగా ఇందులో నటించాను. స్వతహాగా ఆద్యంతం వినోదం పంచిపెట్టే పాత్రల్లో నటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఇకపై సోలో కథానాయకుడిగానే నటించాలని అనుకొంటున్నా''అన్నారు.
ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.
కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రం చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: మోహన్ బాబు.ఎం. నిర్మాత: మంచు లక్ష్మీ ప్రసన్న, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.


Click it and Unblock the Notifications











