మహేష్ బాబుకి అడ్డుపడిన నరేంద్ర మోడీ.. షూటింగ్‌కు నిరాకరణ!
సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాల నుంచి బుధవారమే ఇండియా చేరుకున్నాడు. మహేష్ గడ్డం లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. తదుపరి చిత్రంలో మహేష్ బాబు గడ్డం, మీసాలతో కనిపించబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25 వ చిత్రం ప్రారంభం కాబోతోంది. భరత్ అనే నేను చిత్రం తరువాత మహేష్ బాబు నటిస్తున్న నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా మొదలయ్యాయి. జూన్ 10 నుంచి డెహ్రాడూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావించిన చిత్ర యూనిట్ కు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి.

రెండేళ్ల గ్యాప్
మహేష్ బాబుతో సినిమా తీయాలని దర్శకుడు వంశీ పైడిపల్లి రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు. ఊపిరి చిత్రం తరువాత వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్న చిత్రం ఇదే. మహేష్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వంశీ అంతా పక్కాగా సిద్ధం చేసుకున్నాడు.

భారీ బడ్జెట్‌లో
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. మహేష్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది.

షూటింగ్ కు మోడి అడ్డు
జూన్ 10 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూట్ డెహ్రాడూన్ లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించింది. దీని కోసం ఆర్మీ అధికారులని అనుమతి కోరగా నిరాకరించినట్లు తెలుస్తోంది. డెహ్రాడూన్ లో జూన్ 21 న నరేంద్ర మోడీ పర్యటన ఉండడమే దీనికి కారణం.

ప్రపంచ యోగా దినోత్సవం
జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ డెహ్రాడూన్ లో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మహేష్ 25 చిత్ర యూనిట్ జూన్ 10 నుంచి 25 వరకు అనుమతి కోరారట. సెక్యూరిటీ కారణాల రీత్యా అధికారులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఆలస్యం అయ్యే అవకాశం
డెహ్రాడూన్ లోని సిటీ కాలేజ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. సిటీకి దూరంగా మరొకొన్ని సన్నివేశాలు చిత్రీకరించవలసి ఉంది. ఆ సన్నివేశాలకు అనుమతి లభించే అవకాశం కనిపిస్తోంది. దీనితో మహేష్ 25 చిత్ర యూనిట్ వారి ప్రోగ్రాంని మరొకమారు ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications











