»   » మహేష్ బాబు మూవీకి అనుమతి నిరాకరణ, షూటింగ్ అప్‌సెట్!

మహేష్ బాబు మూవీకి అనుమతి నిరాకరణ, షూటింగ్ అప్‌సెట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శ్రీమంతుడు' లాంటి భారీ విజయం తర్వాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'భరత్ అను నేనే' అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లక్నోలో చిత్రీకరించాలని ప్లాన్ చేయగా..... అనుమతి లభించలేదు.

లక్నోలోని చారిత్రక ప్రదేశం మూసాబాగ్ వద్ద సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ మేరకు అనుమతి కోసం స్థానిక అధికారులను సంప్రదించగా.... 'ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా' అధికారులు అనుమతి నిరాకరించారు.

ప్లాన్ అప్ సెట్

ప్లాన్ అప్ సెట్

లక్నోలో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరుగాల్సి ఉంది. అయితే అనుకోకుండా అనుమతి నిరాకరణ ఎదురవ్వడంతో షూటింగ్ ప్లాన్, షెడ్యూల్ అంతా అప్ సెట్ అయింది.

Mahesh Babu Managed Court : No Justice for Sarath Chandra's Petition - Filmibeat Telugu
అనుమతి నిరాకరణకు కారణం

అనుమతి నిరాకరణకు కారణం

అనుమతి నిరాకరణకు కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ ఏ వస్తువులను తాకొద్దని, చివరకు గోడలను కూడా టచ్ చేయకుండా ఉండాలని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మూసా బాగ్ చారిత్రక ప్రదేశం కావడంతో ఇలాంటికఠినమైన నిబంధనలు ఉన్నాయి. అందుకే సినిమా షూటింగుకు అనుమతి ఇవ్వలేదు.

మరో లొకేషన్ కోసం...

మరో లొకేషన్ కోసం...

మూసాబాగ్‌లో అనుమతి లభించక పోవడంతో ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం వేరే లొకేషన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ ఆలస్యం సినిమా ఓవరాల్ షూటింగ్ షెడ్యూల్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

భరత్ అను నేను

భరత్ అను నేను

నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌ సరసన హీరోయిన్‌ గా కైరా అద్వాని నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.

English summary
In a shocking development, the permission for Mahesh Babu and Koratala Siva's Bharat Ane Nenu has been denied in Lucknow. Apparently, director Koratala wanted to shoot the film at Mossabagh which is a historic site. However, the officials of Archeological Survery of India (ASI) have denied permission to shoot the film at the monument raising several concerns.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu