జగన్ ని కలవాలన్న బాలయ్య.. జగన్ నుంచి ఊహించని సమాధానం.. అసలు విషయం బయటపెట్టిన పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరల మీద కొంత కాలం నుంచి సందిగ్ధత కొనసాగుతుండగానే తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల బృందం వైయస్ జగన్తో భేటీ అవ్వగా ఆ సమయంలో టికెట్ ధర పెంపుతో పాటు దాదాపు 17 అంశాలకు సంబంధించిన అంశాల మీద చర్చలు జరిగాయి. ఈ భేటీ జరిగిన తర్వాత భేటీ మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ బాలకృష్ణ చేసిన కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఈ విషయం మీద మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆహ్వానం అందింది కానీ
గతంలో మెగాస్టార్ చిరంజీవి సహా కొంతమంది సినీ ప్రముఖులు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని వెళ్లిన సమయంలో బాలకృష్ణ వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చర్చలు జరుపుకోవడానికి వెళుతున్నారు అన్నట్లు మాట్లాడి సంచలనం రేపారు. కానీ గత చర్చలు మీద మాత్రం ఆయన కాస్త భిన్నంగా స్పందించారు. అదేమిటి అంటే తనకు కూడా ముఖ్యమంత్రిని కలవమని ఆహ్వానం అందింది అని కానీ ఆయనను కలవలేదని చెప్పుకొచ్చారు.

ఆసక్తికరంగా
ఎందుకంటే ధరలు తక్కువగా ఉన్న సమయంలో అఖండ సూపర్ హిట్ అయింది, తనకు ధరల విషయంలో ఎలాంటి సమస్య లేదని అన్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి నెలకొన్న వివాదం మీద మాట్లాడటానికి వచ్చిన మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు మీడియా ప్రతినిధులు. దానికి పేర్ని నాని ఆసక్తికరంగా స్పందించారు.

ఆశ్చర్యం కలిగించింద
బాలకృష్ణ అలా మాట్లాడి ఉండకపోవచ్చు అని పేర్కొన్న ఆయన అఖండ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అలాగే మచిలీపట్నానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ ద్వారా తనను అఖండ నిర్మాతలు సంప్రదించారని చెప్పుకొచ్చారు. నాతో కలిసి మాట్లాడాలి అనుకుంటున్నట్లుగా వాళ్ళు వెల్లడించారు అని అయితే దానికి కూడా ముహూర్తాలు చూసుకుని కలవాలి అని అనడం తనకు కొంచెం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

భేటీ కావాలి అనుకుంటున్నట్లు
అయినా సరే ఒప్పుకుంటే ఒకసారి విజయవాడలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి వచ్చి తనను కలిశారని తనతో మాట్లాడుతూ ఉండగానే నందమూరి బాలకృష్ణ గారికి ఒక ఫోన్ కాల్ రింగ్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. అదేమిటి అంటే ఆయన ముహూర్తం చూసుకుని ఫోన్ చేస్తారని చెప్పారని, వాళ్ళు చెప్పినట్లు గానే కాసేపటికి నందమూరి బాలకృష్ణ ఫోన్ చేశారని అన్నారు. అలా ఫోన్ చేసిన సమయంలో తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ కావాలి అనుకుంటున్నట్లు నందమూరి బాలకృష్ణ చెప్పారని అయితే తాను ఇదే విషయాన్ని జగన్ దృష్టికి కూడా తీసుకు వెళ్లానని అన్నారు.

చేసి పెట్టేయండి
అయితే ఎందుకు కలవాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించిన జగన్ కి ఇలా సినిమా టికెట్ రేట్లు విషయం మీద కలవాలి అనుకుంటున్నారు అంటే ఆయన లాంటి పెద్ద మనిషి నా దగ్గరికి వస్తే ఆయన స్టేచర్ తగ్గిపోతుంది కాబట్టి ఆయనకు ఏం కావాలంటే అది చేసి పెట్టేయండి అని అన్నారని అది జగన్ వ్యక్తిత్వం అని మంత్రి నాని చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ తేడా గా మాట్లాడారు అని అంటున్నారు నేనైతే బాలకృష్ణ గారు మాట మార్చే మనిషి అనుకోవడం లేదు ఆయన అసలు అలా అని ఉండకపోవచ్చు అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











