పవన్ కళ్యాణ్ ఓ కామెడీ సినిమా.. పేర్ని నాని సంచలనం.. బాలకృష్ణను లాగుతూ కౌంటర్!

జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ వంటి అంశాల్లో పవన్‌ కల్యాణ్‌ నిబద్ధతతో ఉన్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను కామెడీ సినిమా అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

బ్యాలెన్స్ చేస్తూ ముందుకు

బ్యాలెన్స్ చేస్తూ ముందుకు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఏపీలో ఏ సమస్య వచ్చినా తనదైన రీతిలో ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక రోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం మీ పలు విమర్శలు చేశారు. తన సినిమాలను ఆపేసి దెబ్బ కొట్టాలని చూశారని, ఒక వేళ అటువంటి పరిస్థితులే ఏర్పడితే తన సినిమాలు ఉచితంగా ఆడిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.

ఓ కామెడీ సినిమా

ఓ కామెడీ సినిమా

తమ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే ప్రజల తరఫున నిలబడతామని, 2024లో వచ్చేది తమ ప్రభుత్వమేనని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ కామెంట్స్ మీద స్పందించిన పేర్ని నాని, పవన్‌ కళ్యాణ్‌ ఓ కామెడీ సినిమా లాంటి వ్యక్తి. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తే తానూ ఢిల్లీ వచ్చి ఉద్యమంలో పాల్గొంటానని గతంలో చెప్పారని అన్నారు...

ఈల వేస్తే

ఈల వేస్తే

హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆయన ఆచూకీ లేదని విశాఖ ఉక్కుపైనా పవన్‌ కళ్యాణ్‌ అదే కామెడీ చేస్తున్నారని అన్నారు. మొన్న పరిశ్రమ వద్ద.. నిన్న మంగళగిరిలో సినిమా చూపించారు. తాను ఈల వేస్తే ప్రధాని మోదీ, అమిత్‌ షా పనులు చేస్తారని చెప్పే పవన్‌ కళ్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని వారిని ఎందుకు అడగడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.

 టికెట్‌లు అమ్మకుండా

టికెట్‌లు అమ్మకుండా

ఇక ఆయన నటించిన సినిమాలను రాష్ట్రంలో ఉచితంగా ప్రదర్శించడం కాదు.. బ్లాక్‌లో టికెట్‌లు అమ్మకుండా చూస్తే చాలన్నారు. సినిమా టిక్కెట్ల విషయంలో తాజాగా విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరల పైన తాను గతంలో సూచనలు చేసానని వివరించారు. ఇప్పుడు మంత్రి పేర్ని నాని స్పందిస్తూ..బాలయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు.

భీమ్లా నాయక్

భీమ్లా నాయక్

ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం తాజాగా పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లా కు వెళ్లారు. వికారాబాద్ జిల్లా మదనపల్లి రామాలయం వద్ద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఇక ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X